సరదా సరదా ఓ ఆట
పరదా వెనుక మా పాట
ఆడుతుపాడుతు ఉంటం
కాలంగడుపుతు ఉంటం!;
డ్రాయింగ్ బోర్డు ఒకటి తెస్తాం
పర్ఫెక్టుగా ఒక చిత్రంమేం గీస్తాం
చూసే వారంతా ఇక రండీరారండి
చూసి చిత్రం ఎవరిదో గుర్తించండి!
వచ్చి పోయే జనమంతా
ఆపితే ఉందురు నా చెంత
రైట్ అంటేనే వెళతారు వారు
కాదంటే అక్కడనే ఆగుతారు!
నే తలపై టోపీ పెట్టేస్తా
నాచేతిలో లాఠీ పట్టేస్తా
నానోటితో సీటీ ఊదేస్తా
వినకుంటే ఫైన్ నే కట్టిస్తా!
ట్రాప్.లో మీరు పడవద్దు
ట్రాఫిక్ పోలీసును నేకద్దు
ఇప్పటికైనా తెలిసిందా
టక్కున ముడివీడిందా !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి