గాంధేయవాది బానోత్ జాలంసింగ్ జయింతి సందర్భముగా : : -రాథోడ్ శ్రావణ్, పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా.9491467715

 ఏ నాయకుడి చరిత్ర చదివినా వారి బాల్యంలో ఇంట్లో పెద్దల కథలు పాఠాలు చెప్పేవారని మానవతా విలువలు నైతిక విలువలు బోధించేవారనీ మహాత్ముల చరిత్రలు చెప్పి ప్రేరణ కల్గించేవారినీ మన అందరికీ తెలిసిన విషయమే ! కాని ఇప్పుడు కాలం మారింది.కథలు చెప్పేవారు లేరు ఉన్న వినే వారు లేరు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు, వ్యాపారాలు, వ్వవసాయాలు లేదా ఇతర వ్వవహారాల్లో పడిపోయారు, ఉమ్మడి కుటుంబాలు సన్నబడి పోయాయి.మరి నేటి తరానికి కథలు, పాఠాలు చెప్పే దెవరు అంటే దూరవాణి, చరవాణి అనే సమాధానం వస్తుంది. మన తొలి తరానికి సంబంధించిన మహానీయుల గురించి వారు అనుసరించిన బాటల గురించి చెప్పేదెవరు ? మన బంజారా సమాజంలో తొలి తరం నాయకుల చరిత్రలు తెలిసేదెట్లు ? బంజారా సమాజంలో వీరులు, రాజులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఉన్నా వారి చరిత్ర లిఖించక పోవడానికి కారణం కవులకు, రచయితలకు ధనములు, ధాన్యాలు, ఇచ్చిరాయించక పోవడం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇంతటి ఘన కార్యాలుచేసి కీర్తి గడించిన నిరాడంబర వ్యక్తి, ప్రముఖ, సంఘసంస్కర్త, గాంధేయవాది, గిరిజనబిడ్డ, గౌరవ శ్రీ బానోత్. జాలం సింగ్ గురించి సమాజానికి పరిచయం చెయ్యడం సంతోషంగా ఉంది. 
ప్రముఖ గాంధేయవాది, రాజకీయనేత, సంఘసంస్కర్త,
రైతుబిడ్డ,సమాజసేవకుడు, ఉద్యమకారుడు, స్వర్గీయ బానోత్ జాలంసింగ్ గ్రామం నార్నూరు, తాలుకా ఉట్నూరు, జిల్లా ఆదిలాబాదులో 1943 అక్టోబర్ 2 న  బానోత్  సుర్తాబాయి, సక్రునాయిక్, లంబాడీ గిరిజన దంపతులకు జన్మించారు. జాలంసింగ్ కు నాల్గు ఏళ్ళ వయసులో తల్లిదండ్రులు చనిపోయారు.నానమ్మ బానోత్. ముందడిబాయి, చిన్నమ్మచిన్నాన  బానోత్. సుందల్ బాయి, దగ్డూనాయక్ దంపతుల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు.ఐదోయేట స్వస్థలం నార్నూరు బడిలో చేరి తెలుగు భాషలో బోధనా లేక పోవడంతో  మరాఠీ భాషల్లో వర్ణమాల,  వ్యాకరణంతో పాటు గణితంలో కూడికలు తీసివేతలు,గుణాకారం,భాగాహారం,ఎక్కాలు మొదలగు సంవత్సర కాలంలోనే ఒకటి, రెండు తరగతి పూర్తి చేశారు. ఇతని ప్రతిభను గుర్తించిన  వారి గురువు శ్రీ ఆడే. సంబర్ సింగ్ మాస్టర్ రాజల్ గూడ గారు మూడవ తరగతికి సంబంధించిన పాఠాలు చెప్పడం మొదలుపెట్టినారు.చిన్నప్పటినుండి,అన్ని తరగతులలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు.
 ప్రాధమికోన్నత విద్య కై అప్పటి తాలుకా ఉట్నూర్ లో  ఏడో తరగతి  వరకు చదవి  అర్థిక పరిస్థితి బాగు లేక చదువు మధ్యలో  మానేశారు .ఆ తర్వాత  పొలం పనులు కొనసాగిస్తూ ఇంట్లోనే చదవేవారు, చదువు  పై  మమకారం పెంచి సమయం దొరకినప్పుడు రామాయణం, భగవద్గీత, హిందీ సాహిత్యంలోని ప్రసిద్ధి చెందిన కవులు మహాత్మా కబీర్ దాస్,గోస్వామి తులసిదాస్,సూరదాస్, రహీం, రసఖాన్,  రచించిన దోహాలు,కథలు, పాఠాలు, హిందీవ్యాసాలు, దోహావలీ,గీతావలీ, కబీర్ భజనావలీ, హనుమాన్ చాలీసా చదవి, చెప్పడం రాయడం, నేర్చుకొని దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాదు వారు నిర్వహించిన పదవ తరగతి తత్సమాన విలువ గల ప్రథమా పరీక్షకు సంసిద్ధమై "ప్రథమా"పరీక్ష యందు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. తన16 వ యేట ధుర్పతబాయి అనే పదమూడేళ్ల అమ్మాయితో బాల్యవివాహమయింది. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున జన్మించిన ఆయన గాంధీ అనుచరుడిగా మారి సత్యాగ్రహం, అహింస, శాంతి వంటి గాంధీ భావజాలం బానోత్ జాలం సింగ్ ను తీ వ్రంగా ఆకర్షించింది.ఖాదీ ధరించడం, మద్యం,మాంసాలకు దూరంగా ఉండటం,హరిజనోధ్ధరణ మొదలగు తూ:చ తప్పకుండా పాటించారు.శాంతి,ఆంహింస, న్యాయం, ఆయుధాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.అందుకే ప్రజలచేత ఆదిలాబాదు జిల్లా బంజారా గాంధీగా కొనియాడబడ్డారు.
 పెరిగి పెద్దయ్యాక బానోత్ .జాలంసింగ్ సమాజంలో పేరుకుపోయిన సాంఘిక దురాచారాలు,బాల్యవివాహాలువరకట్నం, జంతుబలి, అంటరానితనం,బాల కార్మికులు, హింసా,మూఢ నమ్మకాలు మొదలగు నిర్మూలనకే కృషి చేశారు.
 బానోత్. జాలంసింగ్ చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే  అహింసా, సేవా కార్యక్రమాలు, కార్యదీక్ష, సాహసం, ధైర్యం, న్యాయం, విజ్ఞాన, తృష్ణలు,  అమర్ ఘడ్ ,సోమఘడ్  తాలుకా జీంతురు, జిల్లా పర్భణి పీఠాధిపతి అయిన బాబా ఈశ్వరసింగ్ మాహారాజ్ ,బాబా శివచరణ,బాబా సురదాస్, మరియు నాందేవ్ మహారాజ్  భోధనలు, రచనలు , అతని ఆధ్యాత్మిక చింతనతో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. 1965 నుంచి ఆధ్యాత్మిక మార్గంలో హింసా, జంతుబలి, వరకట్నం,  బాల్యవివాహాలకు వ్యతిరేకంగా  ప్రజలను చైతన్య పరుస్తూ సమాజాన్ని జాగృతం చేశారు.1971లో భీంపూర్ గ్రామంలో  వీరి బందువులు, మిత్రులు అయిన రుప్లామాహరాజ్, తారాచంద్ మహారాజ్ ,బాబ్జీ నాయిక , కైలాస్ నాయక్, చంద్రమాష్టరు, శ్రావణ్ మాష్టారు,ఎంకామాష్టర్ చూనిలాల్, నారాయణ జాదవ్  సోర్భాజీ పటేల్ మొదలగు వారి ఆధ్వర్యంలో భీంపూర్ యజ్ఞంలో పాల్గొన్ని వేదమంత్రాలు పఠనంలో చూరుకైనా పాత్ర పోషించారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక  ప్రశాంతత లభిస్తుందని అనుకోని  కలియుగ ప్రత్యక్ష దైవం అయిన  తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నార్నూరులోని విజయనగర్  కాలని వద్ద ఉన్న కొండ పై‌ మందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ 1991 లో ప్రారంభించారు.ఆలయాల వల్ల వ్యక్తికి కుటుంబానికి,సమాజానికి, దేశానికి, అనేక ఉపయోగాలుంటాయని, వాటి వల్ల ప్రతి వ్యక్తిలో, ప్రజల్లో, సమాజంలో, దేశభక్తి‌ భావం,  ప్రశాంతత, శ్రద్ద, ధ్యానం పెరిగి మనిషి ,మానసికోల్లాసంగా ఆరోగ్యంగా మరియు సత్ప్రవర్తన సన్మార్గంలో నడుచుకుంటాడని అకుకోని నార్నూరు ప్రజలు, వ్యాపారస్థులు, ఉద్యోగులు అందరి సాహాయసాకారంతో, మరియు తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు వారి సాహయసాహకారంతో మందిరం పునః నిర్మించి ఆలయశిఖర కలశ స్థాపన విగ్రహానికి పూజ మరియు ప్రత్యేక అభిషేకం చేయించారు.అలా భగవంతుని సేవ చేస్తూ దినదినాభివృద్ధి జరిగి ప్రస్తుతం మందిరం చాలా మంది ప్రజలకు శుభకార్యాలకు పెళ్ళిలకు  ఉపయోగపడుతుంది.
హనుమాన్ మందిరం, దుర్గా మందిరం,అంబేడ్కర్ భవన్, ముస్లిం సోదరుల మసీదు, ఈద్గా, మొదలగు వాటి  స్థలాల కేటాయింపుల కోసం కృషిచేశారు. 
బానోత్ .జాలంసింగ్  ప్రజానాయకుడు, 1967 వ సంవత్సరంలో నయాపైసా ఆశించకుండా  రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి‌ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు.తన ఆలోచనని ఆచరణలో పెట్టి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి 1967 లో నార్నూరు గ్రామపంచాయతీకి  ఉప సర్పంచ్ గా  ఎన్నికయ్యారు.1970 లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నార్నూరు  గ్రామపంచాయతీకి సర్పంచిగా ఎన్నికయి 2002 వరకు సర్పంచుగా సేవలు అందించారు. దాదాపు 32 సంవత్సరాలు సుధీర్గకాలం  పదవిలో కొనసాగుతు గ్రామ అభివృద్దికై కృషి చేశారు.1979-1980 లో  తాలుకా ఉట్నూరు బ్లాక్ పరిషత్  అధ్యక్ష ఎన్నికలు జరిగాయి, అధ్యక్షపదవి కోసం పోటి చేసి 450 ఓట్లతో ఓటమి పాలయ్యారు.
1982 లో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగు దేశం పార్టీ స్థాపించారు. రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తు తనదైన ముద్ర వేస్తున్నా బానోత్ .జాలంసింగ్  కృషిని గమనించిన  తెలుగుదేశం అధినేత నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం  పార్టీలో ఆహ్వానించి 1983 లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దేలుగుదేశం పార్టీ నుండి ఖానాపూర్ నియోజకవర్గపు టిక్కెట్టు కేటాయించారు. కాంగ్రెసు పార్టీ నుండి కోట్నాక భీంరావు, స్వతంత్ర అభ్యర్థిగా ఆజ్మేరా గోవింద్ నాయక్ పోటీ చేశారు. జాలంసింగ్ గారు 1200 వందల  అతి  స్వల్ప ఓట్లతో ఆజ్మేరా గోవింద్ నాయక్ చేతుల్లో పరాజయం పాలయ్యారు. అతని సేవలను గుర్తించిన  తెలుగుదేశం ప్రభుత్వం  ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ యందు  జిసిసి డైరెక్టర్ నామినేటెడ్ పోస్టును కట్టబెట్టింది.1984 మరియు1986 దాదాపు రెండు సంవత్సరాలు జిసిసి డైరెక్టర్ గా   పదవిలో కొనసాగుతు, అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులను దళారి వ్యాపారస్థుల నుంచి కాపాడే లక్ష్యంగా కృషి చేసి గిరిజనుల అభివృద్ధికోసం పాటుపడుతు వంద మంది గిరిజన నిరుద్యోగులకు గిరిజన సహకార సంస్థలో ఉద్యోగం కల్పించడానికి కృషి చేశారు. 2001-2002 వ సంవత్సరంలో  జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జెడ్పీటీసీ నార్నూరు టిక్కెట్ కేటాయించింది. నార్నూరు జెడ్పీటీసీ గా విజయం సాధించి 2002 సంవత్సరం నుండి 2007 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలు నార్నూర్ జెడ్పీటీసీగా సేవలు అందించారు.2013-2014 లో  మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి నార్నూర్ ఎంపీటీసీ గా గెలుపోంది  2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు ఎంపీటీసీ గా సేవలు చేశారు.తాను ఏదైతే సంకల్పం పన్నారో అందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ఏంపల్లి ప్రాజెక్టు కలా గానే మిగిలిపోయాయి.
 ప్రస్తుత సమాజంలో విద్యకు చాలా విలువ ఉందని ,చదువు విలువ చదువుకున్న వారికీ మాత్రమే తెలుసు అని ఒక వ్వక్తి జీవితాన్ని చదువు మాత్రమే మారుస్తుందని చదువు మనిషిని మనిషిగా తయారు చేసి గొప్ప శిఖరాన్ని అధిరోహించే విధంగా తయారు చేస్తూందని బలంగా నమ్మేవారిలో బానోత్. జాలంసింగ్ ఒకరు అదే ఆలోచనతో నార్నూరు యందు మండల పరిషత్ పాఠశాలలు, గిరిజన,దళిత, మరియు మైనారిటీ విద్యార్థులకు తెలుగు మరియు ఉర్దూ మాధ్యమంలో పాఠశాలలు మంజూరు చేయించారు.1960 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  తెలుగు,మాధ్యమంలో మంజూరు చేయించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తంతితపాల కార్యాలయం, పశువైద్యశాల , టెలిఫోన్ సౌకర్యం, మరియు1993 లో  ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల, పక్కభవనాన్ని, కస్తూర్బాగాంధీ  బాలికల పాఠశాల,యస్.సి, యస్.టి వర్గాల విద్యార్థుల కోసం పాఠశాలలు, మరియు వసతిగృహాలు నిర్మించే విధంగా కృషి చేశారు. 
1999-2000 సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల మంజూరుకై   నిరాహారదీక్ష చేసి గురుకుల కళాశాల మంజూరు అయ్యే వరకు కాళ్ళకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. 1998 లో ఎట్టకేలకు గురుకుల కళాశాల మంజూరు చేయించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ,శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నార్నూరుకు రప్పించి గురుకుల కళాశాల ప్రారంభోత్సవం చేయించారు.ఇంతటి పట్టు విడువని విక్రమార్కుడిలా తన  లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేశారు. 2008-2009 వ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్నూరు యందు  మంజూరు చేయించి  నార్నూర్ నుండి గాదిగూడ వెళ్ళే మార్గంలో  జీన్నింగ్ గూడ సమీపంలో కట్టించారు. తాను జెడ్పీటీసీ ఉన్న 2013-2014 లో  మాడల్ స్కూల్ జూనియర్ కాలేజి  ఆంగ్ల మాధ్యమంలో మంజూరు చేయించి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  గిరిజన ప్రాంతాల్లో రోజు రోజుకు పెరుగిపోతున్న నేరాలను అదుపు చేయడానికి మండల కేంద్రం నార్నూరులో పోలిస్ స్టేషన్ మంజూరు చేయించి జిల్లా పోలీసు అధికారులతో  భవనం ప్రారంభించారు. మండల ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం మండల కేంద్రములో వైధ్యం కోరకు  30 పడుకల నూతన ఆసుపత్రి భవనం మంజూరు చేయించి అన్ని హంగులతో సౌకర్యాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మండల అభివృద్ధికోసం కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దీక్ష శిబిరాన్ని చేపట్టారు.
 బంజారా సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు  న్యాయం చేయడమే అతని లక్ష్యం . ప్రజల పక్షాన నిలబడే శాంతిదూత అతడు, ఇరు వర్గాలకు సంబంధించిన ఎంతటి జటిలమైన సమస్యలను కుడా పరిష్కరించటంలో  నిపుణుడు, ఎంతటి వారైనా అతను చెప్పినదానికి రాజీ పడాల్సిందే. అలా అని అతను న్యాయవాది కాదు. న్యాయమూర్తి అంతా కన్నా కాదు.అతను ఒక మాజీ సర్పంచి, మాజీ జడ్పీటీసీ అతడే బానోత్. జాలంసింగ్.
కులమతాలకు అతీతంగా అన్నీ  కులాల,మతాల  ప్రజల సమస్యల్ని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారించే సౌమ్యుడు. ఏదైనా గొడవలు, జరగి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి మళ్ళీ  తన ఇంటికి వచ్చినప్పుడు  ఎంతో సహనం ఓర్పుతో అతి జటిలమైన సమస్యలను కుడా చాలా సులభంగా  పరిష్కారించడంలో నిపుణుడు . భార్యాభర్తల గొడవలు, అన్నాదమ్మల పంచాయతీ, భూవివాదం, కులాలు మతపరమైన గొడవలు ఇంటి సమస్యలు,‌పోలిసు స్టేషన్లో నమోదైన కేసులు, పరిష్కారదశలో ఉన్నవి, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఇలా చాలా మంది మహిళలు‌  పరిష్కారం కోసం తన ఇంటికి  వచ్చినప్పుడు ఆ జంటను ఏకం చేసి వాళ్ల మధ్య రాజీకుదరించిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా కలసిమెలసి జీవించే విధంగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇప్పటి వరకు నాశనమైన ఎన్నో సంసారాలను  ఏకం చేశారని రచయిత రాథోడ్ శ్రావణ్ తన పూర్వకాల జ్ఞాపకాలను గుర్తు చేశారు.
  అతను బంజారా జాతి ధృవతార  తాను పుట్టిన జాతి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించి బంజారాలను షెడ్యుల్ ట్రైబ్ గా గుర్తించేందుకు  ప్రముఖ లంబాడీ నాయకులు స్వామి నాయక్,
రవీంద్రనాయిక్,   వాగ్యానాయిక్,తన బావా అమర్ సింగ్ తిలావత్ జాలం సింగ్ మిత్రులు రాథోడ్ హరి , జాదవ్ మానిక్ రావు, కిషన్ చౌహాన్ ,మొదలగు వారితో  కలిసి తెలంగాణ లంబాడీలు కుడా ఆంధ్రప్రదేశ్ లంబాడీ,సుగాలీలతో పాటు ఒకటే భాష, సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉన్నారని అప్పటి ప్రభుత్వంతో పోరాడి కేంద్ర ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిటీ నివేదిక ఆధారంగా రాజ్యాంగ ప్రకారం 1976 లో 108/76 అమెండ్ మెంట్ ద్వారా లంబాడీలను ఎస్టీలుగా గుర్తించడంలో కృష్ణ చేశారు. 2017 లో లంబాడీలు, ఆదివాసీల మద్య జరిగిన గొడవలో ఆదిలాబాద్ జిల్లా లంబాడీ ప్రజల తరఫున నాయకత్వం వహించారు. ఆదివాసులు మా సోదరులే ‌ తరతరాలుగా ఈ ప్రాంతంలో కలిసి మెలిసి ఉంటున్నాము మన మధ్య గొడవలు ఎందుకు ? మన హక్కుల కోసం  మరియు మనకు రావాల్సిన 10% రిజర్వేషన్ కోసం పోరాడుదాం అనేవారు. అభిమానులు అయినను బంజారా గాంధీ అని లంబాడీ టైగర్ అని పిలుచుకునేవారు. స్వార్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాటంలో విశ్వసం ధైర్యం కారణంగా  అతను ఆదిలాబాద్ జిల్లా బంజారా గాంధీగా గుర్తింపు పొందాడు.
అఖిల భారతీయ బంజారా సేవా సంఘం సమావేశం మహారాష్ట్ర లోని యావత్మాల్ జిల్లా డిగ్రేస్, మరియు సోమగడ్ జిల్లా పర్భణిలో జరిగిన సమావేశాలకు   హాజరైనారు. ముఖ్య అథితి బంజారా మొట్ట మొదటి పద్మశ్రీ  గౌరవ శ్రీ రాంసింగ్ బానావత్ , మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ పార్లమెంటు సభ్యులు ఉత్తం రాథోడ్  హాజరైనారు.బంజారా జాతి ఐక్యత బంజారాల లంబాడీల  సమస్య పరిష్కర దిశగా కృషిచేశారు. అఖిల భారతీయ కిసాన్ సమ్మేళనం 1989 లో రెండు రోజుల పాటు దేశ రాజధాని న్యూ ఢిల్లీలో   భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి  ఆధ్వర్యంలో జరిగినది. అట్టి సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రధాని ఆహ్వానం మేరకు హాజరయ్యారు.
 భారత దేశ ప్రధాని స్వర్గీయ  పి. వి. నరసింహారావు కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో 1994 లో  భారతదేశ గ్రామ పంచాయతీ విధి విధానాలు గురించి సమావేశాలు జరిగాయి.ఆ సమావేశంలో పాల్గొనుటకు అదిలాబాద్ జిల్లా నార్నూరు సర్పంచి గౌ శ్రీ బానోత్. జాలంసింగ్  కు ఆహ్వానం పత్రం అందించారు. అట్టి సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా నుండి పాల్గొన్నారు. తెలంగాణ తొలి దశ‌ ఉద్యమం  మలి దశ ఉద్యమంలో పాల్గొని రాజకీయల్లో ఆజాతశత్రువుగా ముద్రపడ్డ బానోత్ జాలం సింగ్ కోవిడ్ బారినపడి నిజామాబాదులో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16 డిసెంబర్ 2020లో కన్నుమూసిన జాలం సింగ్ నేటి తరానికి దిక్సూచి. వీరిని తెలంగాణ ప్రభుత్వం తరఫున పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయాలి,వీరి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి,నార్నూరు మండలానికి జాలంసింగ్  పేరు పేట్టాలని అతని అభిమానులు డిమాండ్.
అయిన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.బానోత్ జాలంసింగ్  విగ్రహాన్ని నార్నూరులో జరిగే అతని మొదటి వర్ధంతి  డిసెంబరు 16 నా  ప్రతిష్టించాలని బానోత్. జాలం సింగ్ విగ్రహా ప్రతిష్టాపన కమిటీ ఏకగ్రీవంగా తిర్మానించింది.కమిటీ సభ్యులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు,  విగ్రహ ప్రతిష్టాపన గురించి తిర్మానం చేసి ఆ కమిటీ తన ప్రియ శిష్యుడైన బోథ్ శాసనసభ సభ్యులు గౌరవ శ్రీ రాథోడ్. బాపూరావు గారిని   గౌరవ అధ్యక్షులుగా, యువకులు, జిల్లా ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత, నార్నూర్ గ్రామ పంచాయతీ నవనిర్మాణ శిల్పి, శ్రీ, బానోత్.గజానంద్ నాయక్ గారిని అధ్యక్షునిగా, మాజీ నార్నూర్  జెడ్పీటీసీ  శ్రీ. జ్ఞానోభా పుష్కర్ గారిని ప్రధాన కార్యదర్శిగా  ఏకగ్రీవంగా కమిటీ  తీర్మానించింది.

కామెంట్‌లు