*ప్రేమ-సాహిత్యం!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 116. సమస్త సాహిత్యం!
         ప్రేమ సహిత రూపం!
         ప్రక్రియలన్నీ వాహకాలు!
         మనశ్శాంతి ప్రేరకాలు!
117.కాళిదాసు!
        అభిజ్ఞానశాకుంతలం!
        మేఘసందేశం!
        కుమార సంభవం!
        ప్రేమ పరిపూర్ణం!
118.
   జయదేవ ఆ(ఇ)ష్టపదులు!
   మీరా మధుర భజనలు!
   అల్లసాని వారి వరూధిని!
   శ్రీనాథుని శృంగార వైభవం!
119.ప్రేమ!
        ఐదవవేదం!
        ఆరవప్రాణం!
        ఏడవదర్శనం!
        అష్టమస్వరం!
120.ప్రేమ!
        జన్మ నుండి మరో జన్మ!
        ద్వైతం నుండి అద్వైతం!
        ఇహం నుండి పరం!
        ఈనేను నుండి ఆనేను!
              ( కొనసాగింపు)
 

కామెంట్‌లు
రామానుజం. ప చెప్పారు…
ప్రేమ తత్త్వం,పుస్తక అక్షర రూపం -- రెండూ...
అ క్షరాలు, అన్యోపదేశాలు ,ఆచరణీయాలు *