*కర్మయోగి!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 : *గాంధీ జయంతి* శుభాకాంక్షలు అందిస్తూ----
             .-------------------------------------
1."పుట్టుక నీది! చావు నీది!
    నీ బతుకు! ఈ దేశానిది!"
   ప్రజాకవి కాళోజీ మాట!ప్రతి,
   భారతీయుడినోట ఈపూట!
2.మన "జాతిపిత!"
              విశ్వాన "మహాత్మా!"
   గాంధీ స్మరణం,కేవలం!
   జయంతి, వర్ధంతులకేనా!
   నిత్యం నమస్కరిస్తాం!
                     అనుసరిస్తాం!
  ఆచరిస్తాం! తరిస్తాం!
3.ఆత్మవిశ్వాసం నిదానం!
   అహింస నమ్మిన సిద్ధాంతం!
   సహాయనిరాకరణ విధానం!
   సత్యాగ్రహం వజ్రాయుధం!
4.బక్కచిక్కినట్లు కన్పించినా!
   ఉక్కులా నిలిచి స్వాతంత్ర్య
      పోరాటం చక్కదిద్దాడు!
   ముందు నిలిచాడు,
           ముందుకు నడిపాడు!
   స్వాతంత్ర్యామృతఫలం,
          జాతికి అందించాడు!
  బోసి నవ్వు తో మన,
       హృదయాల్లో నిలిచాడు!
5.అర్ధనగ్నంగా ఉన్నా!
   బ్రిటిష్ దమననీతి భగ్నం!
   అతిసామాన్య జీవితమైనా!
   అనన్యవ్యక్తిత్వంతో,
           హిమాలయశిఖరం!
   వ్రాసిన  "ఆత్మకథ",
      సత్యదేవాలయగోపురం

కామెంట్‌లు
రామానుజం. ప చెప్పారు…
జాతిపిత కు 🌹🙏 పుష్పాంజలి