సాధుజీవనం ఉత్తమం అనే విషయంపై స్వేచ్ఛ ఛందస్సులో....సాహితీసింధు సరళగున్నాల

 చం*పలుకగ సత్యవాక్కులను 
ప్రాణులయెయ్యెడప్రేమజూపుచున్
తలపున శాంతి నోర్పులను 
దాల్చియుధర్మముదప్పకుండగన్
ములుకులమాటలాడకను 
,మోహముజూపని కార్యవర్తుడై
యిలతనునుండసాధుజీవియని
యెల్లరుమెత్తురునుత్తమోత్తమై
కామెంట్‌లు