రక్తపట్టిక కణాల లోపం -నివారణ.; - పి .కమలాకర్ రావు
 Platelet Count తగ్గడం ( Thrombocytopenia )
శరీరంలో ప్లేటిలెట్స్ ఉండాల్సినన్ని
లేకపోతే రక్తం గడ్డ కట్టే గుణం పోయి రక్తస్రావం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ప్లేటిలెట్స్ కౌంట్
ను పెంచుకోవలసిన అవసరం
వుంది.
లేతబొప్పాయి ఆకులను కడిగి
ముక్కలుగా త్రుంచి నీటిలో వేసి
జిలకర పొడి వేసి కాషాయంగా కాచి చల్లార్చి తేనె కలిపి త్రాగాలి
రోజుకు రెండు పూటలు తీసుకుంటే
ప్లేటిలెట్స్ పెరుగుతాయి.
2. అల్లం రసం తేనె ఒకరోజు, పసుపు తేనె మరో రోజు ఇలా వరుసగా కొన్నాళ్ళు త్రాగినా కూడా
ప్లేటిలెట్స్ పెరుగుతాయి.
3. ఉసిరి వరుగులు +కిష్మిష్ +మెంతిపొడి నీటిలో వేసి కాషాయం కాచి చల్లార్చి త్రాగినా కూడా ప్లేటిలెట్స్ పెరుగుతాయి.

కామెంట్‌లు