నానీలు - ప్రయాణం ;-. ఎం. వి. ఉమాదేవి.
 1)
ప్రతి ప్రయాణం 
ఉత్సాహం తో మొదలు 
అనుభవాలు 
సీటిచ్చినవ్వుతాయి !
2)
ఎక్కడ కక్కడ
మరిచేవి కొన్నే కానీ 
ప్రయాణం
భవ్య  జ్ఞాపకాల నిధి!
3)
అన్నీ సర్దుకునే 
హడావుడి లో 
రిజర్వేషన్ 
చరవాణి ఇంట్లోనే!
4)
భోజనాలవేళ 
రైల్లో ఆకలి కేకలు 
ఎదుటివారివే 
రుచి కళ్ళకు!
5)
మన ప్రయాణానికి 
ఇతరుల ఏర్పాట్లు 
కన్నీటి యాత్ర 
చివరిరోజు !

కామెంట్‌లు