"కార్తీకమాసవిశిష్టత-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
నదిస్నానమ్మునుజేసియు
పదిలముగాపూజసల్పుభక్తజనములున్
మదిలోశివకేశవులను
ముదమారగదల్చుచుండిమ్రొక్కుచునుండున్!!!

02.
కం.
కార్తీకమాసమిదియని
ఆర్తిగపూజించుచుండునాదైవములన్
ప్రార్థించుచుసౌభాగ్యము
పూర్తిగనందించిదివ్యమోక్షమిడుమనున్!!!

03.
కం.
దీపాలనువెల్గించియు
దీపాలనుదానమొసగుతేజమ్మలరన్
దీపాలవెల్గులందున
దీపారాధనసలుపునుధ్యేయముతోడన్!!!

04.
కం.
అయ్యప్పమాలవేసియు
అయ్యప్పనుగొల్చుచుండునానందముగన్
అయ్యప్పాఅయ్యప్పని
అయ్యప్పకుభజనజేయునద్భుతరీతిన్!!!

05.
కం.
నోములు,వ్రతములుజేయుచు
స్వామినిఆసత్యదేవుస్వామికిపూజల్
నీమముగాజరిపించియు
కామితములుదీర్చుమనుచుకైమోడ్పులిడున్!!!

06.
కం.
వనభోజనాలకెళ్ళుచు
మనముప్పొంగగకుటుంబమాన్యులతోడన్
చనువుగనందరుకలిసియు
తనవారికిప్రేమపంచుతన్మయమొప్పన్!!!
కామెంట్‌లు