మనసిజ ప్రేమ;=మాడుగుల మురళీధరశర్మకాళేశ్వరం/సిద్ధిపేటఫోన్ నెం.7981141762
 కం.1
ప్రేమలు కొంటే దొరకవు
పామరములపంచు మనసు
పరిపరివిధముల్!
నేమిత బంధసు వర్తన
కామనగా సకలజనులు*
గాంచుముదమునన్!
కం.2
అమ్మా,నాన్నలు పంచగ
కమ్మని కమనీయమధుర*
గాముల ప్రేమల్!
ఇమ్మహిజననిగ మొదలగు
సమ్మతిసర్వాంగమైన*
సహజపు ప్రేమల్!
కం.3
కొమ్మల పేగుసు బంధము
రమ్మనుచునుపిల్చురాగ*
రంజితమొప్పన్!
అమ్మహితాత్ముండైనా
అమ్మలగన్నట్టియమ్మ*
యనురాగమ్మే!
కం.4
తల్లీ,చెల్లీ,యక్కలు
చల్లనిసంసారజలధి*
సంస్కృతికిరువై!
ఉల్లమ్ములుపులకించగ
నెల్లరకాపాడుచుండు*
నేవేళైనన్!
కం.5
మనసిజసంబంధమ్మిది
కనగాకనిపించకుండు*
కనులకు నెచటన్!
కొనగ నలభ్యమ్మౌగా
మనుజులతనుధర్మనిరతి*
మహిమాన్వితమౌ!
కం.6
తల్లీ పిల్లల ప్రేమలు
నిల్లిల్లున పల్లెపల్లె*
నిండుగనుండున్!
గల్లీగల్లినకనబడు
నొల్లని యుల్లాసభరిత*
ముప్పొంగంగా!
కం.7
భార్యాభర్తల ప్రేమలు
కార్యాచరణమ్మునందు*
కలిమినిలేమిన్!
ఆర్యావర్తపు పరిధిన
నిర్యాణముచెందువరకు*
నిక్కమునెచటన్!
కం.8
కందుము ముదిమిని నందరు
కందిన కసిగాయవోలె*
గాయముకలుగన్!
పొందికగలసంబంధము
నందానందమ్మునిచ్చు*
నరజాతికిలన్!
కం.9
జీవులు మూగవి ప్రేమన
భావముతోపెంచిపంచు*
పలుకులతోడున్!
నావగ జీవిత యానము
పావనముగ యవ్వనులుగ*
పంపేవరకున్!
కం.10
ఒకచోటనమ్మలుగనిం
కొకచోకూతురులునత్త*
కోడలుగధరన్!
ఒకచోనక్కాచెల్లెలు
ఒకచోభార్యలుగపంచు*
నొనరెడు ప్రేమల్!
కం.11
ప్రకృతీ పురుషులప్రేమలు
సుకృతముగానందుజీవ*
సోపతి తోడన్!
ఆకృతినందముకనవవి
వికృతపుజీవములమనసు*
విధిరాతేగా!
కం.12
మనసులు కలిసిన ప్రేమలు
నవనీతపుపథమునందు*
నాణ్యతపంచున్!
తను,ధన,ఘన,నీచమ్ములు
మనమున నడ్డంకిరావు*
మర్మపు కలిలో!

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మస్తు ప్రేమలున్నయ్ నమస్కారం శర్మ గారు
కాపుర
Unknown చెప్పారు…
మస్తు ప్రేమలున్నయ్ నమస్కారం శర్మ గారు
కాపుర
Unknown చెప్పారు…
మస్తు్ప్రేమలున్నయ్ ,నమస్కారం
శర్మ గారు
కార