మనదేశంలో బరువులను,దూరాల్ని కొలవడానికి మెట్రిక్ పద్ధతిని ఉపయోగిస్తున్నాము.కానీ ప్రపంచంలో లైబేరియా,ఉత్తర అమెరికా,మయన్మార్ మటుకు పాతపద్ధతిలో అడుగులు,గజాలు పౌండ్లు ఉపయోగిస్తున్నారు.
మరి ఈ 'కిలోగ్రాము' బరువును ఖచ్చితంగా ప్రపంచానికి తెలియచెప్పడానికి సెవ్రస్ అనే చోట ఫ్రాన్స్ లో ప్లాటినం,ఇరిడియం లోహాలను కలిపి స్థూపాకారపు కిలోగ్రామును ప్రత్యేక పద్ధతిలో కాపాడుతున్నారు.ఈ కిలో గ్రాము స్థూపం మీద మూడు ప్రత్యేక గాజు గోళాలు ఉంటాయి,మూడింటికి మూడు ప్రత్యేక తాళాలు ఉంటాయి.
ఒకటో తాళం బరువులు,కొలతల విభాగం డైరెక్టర్ వద్ద ఉంటుంది.మరొక తాళం ప్రపంచ బరువులు,కొలతల చైర్మన్ వద్ద ఉంటుంది.మూడో తాళం ప్రాచీన పత్రాలు, వస్తువులు కాపాడే అధికారి వద్ద ఉంటాయి.
సంవత్సరానికి ఒకసారి అందరి సమక్షంలో ఆ కిలోగ్రాము స్థూపాన్ని జాగ్రత్తగా బయటకు తీసి మరొక ఖచ్చితమైన కిలోగ్రాము రాయితో బరువును తూస్తారు.
ఆ ప్లాటినం ఇరిడియం స్థూపాన్ని చేతితో తాకరు! వెల్వెట్ గుడ్డను ప్రత్యేకంగా చుట్టిన పట్టకారుతో తీసి జాగ్రత్తగా లోపల పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద గీతలు పడకూడదు. దేని మీద ఆ స్థూపాన్ని రుద్దకూడదు.ఎందుకంటే ఆస్థూపంలో కొన్ని పరమాణువులు పోయినా దాని కిలోగ్రాము బరువులో మార్పు వస్తుంది అందుకనే ఆ బరువును అతి జాగ్రత్తగా కాపాడుతున్నారు.
కిలోగ్రాము;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి