దీపావళి : -చంద్రకళ. దీకొండ,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాచరవాణి : 9381361384
ప్రక్రియ: సున్నితం
రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీత గారు

నీలో దీపం వెలిగించు
నీవే వెలుగై వ్యాపించు
అంతరాత్మ బోధను పాటించు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

అధర్మంపై ధర్మం గెలుపు
చెడుపై మంచి విజయం
గుర్తుగా నిలిచెను దీపావళి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

అమావాస్య నాడు అరుదెంచి
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి
జ్ఞానదీపం వెలిగించే పర్వదినం
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

దీపాలవరుసతో ఇల్లంతా వెలుగు
టపాకాయలతో కీటకబాధ తొలగు
కళ్ళలోన ఆనందకాంతుల జిలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

శబ్దకాలుష్యం కలిగించే బాంబులొద్దు
వెలుగుపూల చిచ్చుబుడ్లే ముద్దు
అజాగ్రత్తతో చేతులు కాల్చుకోవద్దు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!!!


కామెంట్‌లు