మృత్యుంజయుడు ఒక్క శివుడే !;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
మృత్యుంజయుడు అయిన శివున్ని ఆరాధించి పూజిస్తే ఎవరైనా మృత్యువును జయించవచ్చు అని ఋగ్వేదం తెలియజేయుచున్నది. మృత్యుంజయుడు అంటే మృత్యువును జయించిన వాడని చాలామంది అనుకుంటారు. కానీ యదార్థమైన నా అర్థం అది ఇది కాదు. మృత్యుంజయుడు అంటే మృత్యువుకు అతీతమైన దైవము. మృత్యువుతో ఎలాంటి బంధం కానీ,అనుబంధం కానీ, సంబంధం గాని లేనటువంటిదేవుడు అని అర్థం. మృత్యువు అంటే, ఆయుష్షు తీర గానే జీవుడు, సర్వ ప్రాణులు దేహాన్ని వదలివేయడం అన్నమాట. మానవులకే కాక దేవతలు కూడా ప్రమాణం ఆయుష్షు ఉందని వేదాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఈ భూమిపై జన్మించారు ఆయుష్షు తీరగానే వారు మరణించారు. కానీ కానీ శివుడు అలాంటి దైవం కాదు. శివుడు దేహ అతీతుడు. శివుడికి ఆయుస్సు తో సంబంధం లేదు. దేహమే లేని శివునికి మృత్యువు ఎక్కడ ఉంటుంది. జననమే లేని ఆ దైవానికి మరణం ఎలా ఉంటుంది. అందుకే శివుడిని మృత్యుంజయుడు అని అంటారు.

శ్వేతాశ్వతరోపనిషత్ ఇలా చెప్పింది.
నీ తస్య కశ్చిత్పతి రస్తిలోకే
నచేశితానైవ చ తస్య లింగమ్
న కారణం కరనాధిపాధిపో

న దాస్య కశ్చి జ్ఞానితా న చాధిపః !!
పరమశివునికి ప్రభువు గాని, నియంతగాని లేడు. శివుడు ఇట్టి వాడని ఊహించుట కు లింగమయ్య చిన్నములు లేవు. శివుడే సర్వ కారకుడు. శివుడే సూర్యాది దేవతలకు ప్రభువు. శివుడికి జనకుడు గాని, జనని గాని లేదు. స్వయముగా ప్రకాశించు వాడు శివుడు.
శివునికి శరీరము, ఇంద్రియ సమూహములు లేవు. ఈ నిజాన్ని వేదములే తెలియజేశాయి.
అందుకే వేదం
ఈశం తం జ్ఞాత్వా హ్యమృతా భవంతి. ఆ శివుడిని దర్శించువారు జనన మరణ రాహిత్యమును పొందగలరని తెలిపినది.
మానవులే కాదు దేవతలు కూడా డా మృత్యువును జయించాలంటే శివుడిని ఆరాధించక తప్పదు.

కామెంట్‌లు