ఒకానొక అడవిలోన
ఉన్న సరస్సు ప్రక్కన
జిక,కుందెలు కలిసి
జీవిస్తుండె చెలిమిన
కుందేలు చురుకుగాను
జింక బద్ధకంగాను
కలిగి వుండేవి రెండు
కూడ జీవిస్తుండెను
మిగతా జంతువులన్నియు
కుందేలు తెలివినంతయు
చూసి మెచ్చుకొన సాగె
నవ్వుతూను వెళ్ళునదియు
కానీ జింక మాత్రము
నాకు లేదు బద్ధకము
అంటూ వాదించుచు
ఒప్పుకో దేమాత్రము
నాకు కూడ తెలివి వుంది
అందమైన రూపు వుంది
అని గొప్పలకు పోతు
గొడవలు పడుతు వుండేది
మిగతా జంతువుల తోడ
రోజు రోజు వాదులాడ
మిగతా జంతువులన్నీ
విసిగి పోయె వాదు లాడ
కొలనుకు పెద్దదైన
జంతువులూ మెచ్చిన
ఏనుగు కల్పించుకోని
చేరె వాటి చెంతన.
ఈ రెండు జంతువులకు
అందరి మేలును కొఱకు
పోటి ఒకటి పెడతానని
పిలిచెను రెంటినచటకు
జాగ్రతగ చూడండి
నె చెప్పేది వినండి
ఒక పెద్ద దుంపను జూపి
మిగత.వారు వినండి
ఈ పెద్దదైన దుంపను
ఈ కొలను ప్రాంతంలోను
దాచి నేను పెట్టెద
వెదికి తీసుక రమ్మనెను.
ఈ దుంప మొత్తమును
వారికె చెందుననెను
ఇక మీరిద్దరు వెళ్ళి
దుంపను వెదుక మనెను
రెండు కూడ ఒప్పుకొనెను
వెదుకుటకు బయలు దేరెను
ఉత్కంఠ భరితంగా
జంతువులు చూచుచుండెను.
కొద్ది సేపు ఆ జింకను
గబగబా వెదుక సాగెను
అంతలోనె విసుగు చెంది
ఒక దగ్గరది కూర్చునెను
ఇంత పెద్ద అడవిలోను
దుంప వెదుక కష్టమేను
కాళ్ళు బాగ లాగెననుచు
విశ్రాంతిని తీసుకొనెను
ఉన్న ప్రతీ చెట్టునూ
అక్కడున్న తుప్పనూ
అణువణువు నిశితంగా
వెదికె బండబండనూ
దుంపను సాధించింది
చేతిలో పట్టుకుంది
మిగత జంతువులు చూసె
ఏనుగంత చూస్తుంది.
అక్కడ సమీపంలోనె
చెట్టు యొక్క తొర్రలోనె
జింక కూర్చున్న దగ్గరె
దొరికింది వెతకంగానె.
కుందేలు ఉత్సాహాన్ని
కుందెలు చురుకుదనాన్ని
జంతువులన్ని మెచ్చుకొనె
చెవులపిల్లిది సహనాన్ని
విజేతగ ప్రకటించాయి
దుంపను కూడ ఇచ్చాయి
ఏ జీవి ఐనను గాని
తెలివిగ బతుక మన్నాయి
జింక అంతయు చూస్తుంది
బద్ధకాన్ని తలచుకుంది
అయ్యో!ఓడి పోయానె
అనుచు బాధను పొందింది
తన తప్పు తెలుసుకుంది
పద్ధతిని మార్చుకుంది
ఇది గుణపాఠమని జింక
తెలివిని పెంచుకున్నది
నీతి
--------
బద్ధకమును వీడాలి
ఓర్పును కలిగుండాలి
ఎదుటి వారు చెప్పేది
వినుట నేర్చుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి