శక్తిశాలి! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజు శక్తివర్మ మంచి తెలివితేటలు శక్తి సామర్ధ్యాలు కలవాడు.తన దర్బార్ లోని వారు ఊరికే అనవసరం గా తనని పొగుడుతారు అని కూడా తెలుసు. అందుకే వారికి  బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఎన్నో సార్లు చెప్పాడు"నేను రాజు ని కదా అని అతిగా పొగడవద్దు.ప్రకృతికి దైవానికిమనమంతా తలవంచాల్సిందే!ఆదివ్యశక్తులముందు మనం దిగదుడుపే!"ఐనా  రాజు ప్రాపకం కోసం  సభికులు అవాకులు చెవాకులు పేలేవారు.వీరికి బుద్ధి చెప్పా లనుకున్నాడు రాజు. పున్నమి రాత్రి సముద్రపు ఒడ్డున విందు ఏర్పాటు చేసి అతిగా పొగిడే వారితోసహా అందరినీ ఆహ్వానించాడు.పుచ్చపూవులాంటి వెన్నెల్లో అంతా విందు ఆరగిస్తున్నారు.రాజు కదిలే అలలను ఎగిసిపడే కెరటాలను  చూడ సాగాడు."ఈ సముద్రం నేను  ఆజ్ఞాపించితే  నిశ్చింతగా నిలకడగా కదలకుండా ఆగుతుందా?" "ఓ .ఆగుతాయి ప్ర భూ!"వెంటనే రాజు కి వత్తాసు పలికారు. రాజు పెద్దగా అరిచాడు "ఓఅలలూ!ఆగండి. కదలవద్దు.ఇక్కడ మేము అంతా విందు ఆరగిస్తున్నాము.మీహోరులో మామాటలు వినపడటం లేదు. మీనీటితో మేము కూచున్న ప్రాంతంని తడపవద్దు." కానీ ప్రకృతి ఆగుతుందా?ఒక్క సారి తెప్పున ఎగిసిపడే అలలలోఅక్కడ ఉన్న వంట కాలపాత్రలు ఆహారపదార్థాలు అన్నీ కొట్టుకుని పోయాయి.రాజు వెంటనే అన్నాడు "చూశారా!నాఆజ్ఞను ధిక్కరించిఅలలు ఎగిసిపడినాయి.మనిషి  ప్రకృతికి దైవానికి తల ఒగ్గి ఉండాల్సిందే!ఎంత బలం తెలివితేటలున్నా మనిషి వాటిముందు దిగదుడుపే! దైవకృప ప్రేరణతో  రాజాధిరాజు మొదలు అతిసామాన్య బీదవాడు బ్రతుకుతాడు కాబట్టే రాజుని ఐనా నన్ను అతిగా పొగడవద్దు అన్నాను.మీస్వార్ధం స్వలాభం కోసం  పదవీవ్యామోహంతో తెగ పొగుడుతూ నన్ను అందలం ఎక్కించే ప్రయత్నం చేయవద్దు అని ఆజ్ఞాపిస్తున్నాను."శక్తివర్మ మాటలతో అంతా సిగ్గుతో తలవాల్చారు.అతి సర్వత్రా వర్జియేత్!
కామెంట్‌లు