రామప్ప వైభవం ; పుస్తక సమీక్ష-ఐశ్వర్య రెడ్డి
 సాహితీ బృందావనం జాతీయ వేదిక స్థాపించి. అన్ని రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తిస్తూ పురస్కారాలు బిరుదులు సన్మానాలు కవితా పోటీలు కవితా సంకలనాలు వెలువరిస్తూ అంతర్జాతీయంగా అన్ని వేదికలకు ఆదర్శంగా నిలుస్తూ వారు నిస్వార్థ సేవలను అందిస్తున్నారు శ్రీమతి నెల్లుట్ల సునీత గారు .
సాహిత్యాన్ని పండించడమే కాక ప్రోత్సహిస్తూ కొత్త కవులను బాల కవులను తయారు చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు.
అంతేకాకుండా భాష సేవకురాలు ,భాష ప్రేమికురాలు, తెలుగు సాహిత్యంలో నూతన ప్రక్రియ సున్నితం సరళ శతకం ఈ ప్రక్రియను రూపొందించి, కవులతో సమకాలిన అంశాలు ఇస్తూ రాయించుతున్నారు,
వంద మంది కవులు రాస్తున్నారు సున్నితం సరళ శతకం ప్రక్రియ.
ఈ ప్రక్రియకు అనతి కాలంలో విశేష ప్రాచుర్యం లభించింది.
అన్ని ప్రసార మాధ్యమాలలో పత్రికలో ప్రచురితం ,ప్రసారం చేశారు సంకలనాలలో కూడా అర్హత పొందినటువంటి సున్నితం సరళ శతకం.
అక్టోబర్ 2 20 20 గాంధీ జయంతి రోజున ప్రక్రియను ప్రారంభించి .కవుల అందరి ఆదరణ పొందుతూ సాహితీవేత్తల అభిమానాలను పొందింది ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా
రామప్ప వైభవం అనే పేరుతో ఈ_ సంకలనాన్ని తీసుకు రావడం శుభపరిణామం.
గతంలో హెల్మెట్ రక్షణపై ఈ _సంకలనం తెచ్చారు ఈ ప్రక్రియలో
ఈ సందర్భంగా శ్రీమతి నెల్లుట్ల సునీత గారికి శుభాకాంక్షలు అభినందనలు అందిస్తున్నాను.
కాకతీయుల కళాత్మకత , జీవం ఉట్టి పడే అద్భుతమైన శిల్ప సంపద, చారిత్రక సాంస్కృతిక సాంప్రదాయం, సప్త స్వరాలు పలికే నల్ల రాతి శిల్పాలు,
హై హీల్స్ వేసుకున్న శిల్పాలు 
మరియు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అద్భుతమైన కట్టడం రామప్ప దేవాలయం. 
ఈ దేవాలయానికి ఈ సంవత్సరంలో ప్రఫ్పంచ స్థాయి గుర్తింపు దక్కడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంలో  రామప్ప దేవాలయం యొక్క చరిత్ర గురించి దాని వైభవం గురించి సంకలనం చేయాలనే ఆలోచన శ్రీమతి నెల్లుట్ల సునీత గారికి రావడం, అనుకున్నదే తడవుగా తాను నిర్వహిస్తున్న సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వారా కవులను ప్రోత్సహించి మంచి కవితలతో నాణ్యమైన కవితా సంపుటిని తయారు చేసి తపస్వి మనోహరం అంతర్జాల మాస పత్రిక వేదిక ద్వారా ఈ సంకలనాన్ని విడుదల చేయడం, అది కూడా ఇంత త్వరగా తీసుకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇందులో కూడా చెప్పదగిన విషయం .
 "సున్నితాలు" ప్రక్రియతో కవితా సంకలనం చేయడం . 
ఎప్పుడు తెలుగు సాహిత్యం నూతన ప్రక్రియలతో నూతన ఓరవడితో నిత్య నూతనంగా  విరాజిల్లుతోంది. అందులో భాగంగానే సునిత గారు "సున్నితాలు" అనే ప్రక్రియకు ప్రాణం పోశారు. కవులు ఆ ప్రక్రియను ఆకళింపు చేసుకొని ,దానికి మంచి గుర్తింపు తీసుకోచ్చారు .  వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.ఆ ప్రక్రియలోనే రామప్ప వైభవం పై కవితలు రాయడం అది ఈ సంకలనం గా మారడం నిజంగా అభినందనీయం .
యాబై నాలుగు మంది కవులు యాబై నాలుగు రకాలుగా రామప్ప వైభవాన్ని వర్ణించారు. అన్ని తేనె ధారలే.

ఒక్కొక్క కవి శైలి ఒక్కో రీతిలో రామప్ప చరిత్ర ను, దేవాలయాన్ని  దాని యొక్క ఆకారాన్ని, శిల్ప కళను, శిల్పులను, నృత్య రీతులను, ఇలా చెప్పుకుంటుపోతే ఎన్నో విశేషాలను కళ్లకు కట్టినట్లుగా వారి కవిత్వం తో కావ్యగానం చేసారు. 


 యాళ్ల ఉమామహేశ్వరి గారు రాసిన కవిత రామప్పదేవాలయం మూలాలను తెలియజేస్తే, మోతిలాల్ గారి కవిత శిల్పకళను వర్ణించింది. ఖలీమ్ పాషా గారి కవితలో రామప్ప వైభవం అంతా కళ్లకు కట్టింది .
రాజగోపాలన్ గారి కవిత రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందుకుంది. గీతా రాణి గారి కవిత నటరాజ స్వామికి నాట్య నీరాజనం అందించింది .
కవిత గారి కవిత సప్తస్వరాలను వినిపించింది, మైలవరపు వెంకట లక్ష్మణరావు గారి కవిత గజరాజుల మదనిక మంజరుల చిరు ధరహసాలను ఒలికింది.
గంగాధర్ గారు  ఆలయ విశిష్టత తెలియజేస్తే పుల్లా బత్తుల జగదీశ్వర మూర్తి గారు రావినూతల గారు శ్రామికులు ఆ దేవాలయం కోసం పడిన 40 ఏళ్ల శ్రమను తెలియజేశారు.తరగని చెరగని మరువని సంపద అంటూ ఆ వైభవం మహాద్భుతం అని కొనియాడారు. జంపన్న శ్రీనివాస మూర్తి గారు రాతి బండ లో మౌనరాగాలు వినిపించారు, శృంగార శోభిత ప్రభంజనం గా అభివర్ణించారు, మాండలోజు శ్రీనివాసమూర్తీ గారు శిల్పాల నగలందాలను, సూర్య కిరణాల కాంతి శోభను, 
యొగానందం గారు మన దేశం మహ అద్బుతం
అందులో రామప్ప అత్యద్భుతం అని వర్ణించారు. 
దినకర్ రెడ్డి గారు పేరిణి శివతాండవం గురించి శాసనాల గురించి చక్కని వర్ణన చేశారు, మద్ది పుల్లారావు గారి కవిత ఆద్యంతం కమనీయం, సుబ్బా జ్యోత్స్న గారు అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని  చక్కగా తెలియజేశారు ,
సత్య మొండ్రేటి గారు కాకతీయ రాజుల కళల గురించి రామలింగేశ్వరుని దర్శనం గురించి, అలాగే పుష్పలీల గారు భారతీయ సంస్కృతి గురించి అందులోని రామప్ప దేవాలయం విశిష్టత గురించి ,సౌందర్య గారు కావ్య సంపద శిల్పసంపద అలాగే ఆలయాన్ని ఎంతో రసజ్ఞంగా నిర్మించిన రామప్ప గురించి చక్కగా తెలియజేశారు. 
అనురాధ మెరుగు గారు కవితా వెంకటేశ్వర్లు గారు మహమ్మద్ చాంద్ బేగం గారు రామప్ప వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. యామిని కొల్లూరు గారు సులోచన గారు బోర భారతి దేవి గారు వందల ఏళ్ల చరిత్ర కు సాక్ష్యంగా అభివర్ణించారు. 
మీ వర్ణన అద్భుతం. ఒకానొక సందర్భంలో కవితలన్నీ చదువుతుంటే నేను గుడి మధ్యలో నిల్చుని ఆ శిల్పాలను చూస్తూనట్టుగా సప్తస్వరాలను వింటున్నట్టుగా తోచింది .
ఒక్కో కవి ఒక్కో అంశాన్ని తీసుకుని అభివర్ణించిన విధానం  అమోఘం అద్వితీయం. 
నేను ఎన్నో సార్లు రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర స్వామిని దర్శించే భాగ్యం పొందాను. ఆ వైభవం గురించి ఆ గుడి యొక్క విశిష్టత గురించి నేను ఎరుగుదును ,
అందుకే ఒక్కో కవితాస్తుతి  ఆ ఈశ్వరుడికి చేసే అక్షరాభిషేకం లా తోచింది. 
ఎంతో కమనీయంగా రమణీయంగా ఉంది రామప్ప వైభవం, 
నెల్లుట్ల సునీత గారు  చేసిన ఈ ప్రయత్నం భావితరాలకు ఒక విశిష్ట కానుక . 
మన రామప్ప వైభవాన్ని  కాకతీయ కట్టడాల ప్రతిభను ,శిల్పకళా నైపుణ్యాన్ని ,భవిష్యత్ తరాలకు చేర్చే దిశగా మీరు చేసిన ఈ ప్రయత్నం అమూల్యం .
ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేసి తపస్వి మనోహరం మాసపత్రిక సంపాదకులు శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారి సహకారంతో ఈ సంకలనంగా రూపొందించిన మీకు నా నమస్సుమాంజలులు. 
తెలుగు రెండు రాష్ట్రాలలో పరిశోధక విద్యార్థులకు అధ్యయనం చేయడానికి దిక్సూచిగా.. పరామర్శ గ్రంథంగానూ యోగపడుతుంది .
 ముందు తరాలవారికి. పాఠకుల్ని సున్నితం సరళ శతకం ప్రక్రియ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను
 సృష్టికర్త శ్రీమతి  నెల్లుట్ల సునీత గారికి
అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ  వీరి సంపాదకత్వంలో మరెన్నో పుస్తకాలు వెలువడాలని  కోరుకుంటూ
రామప్ప వైభవం ఈ సంకలనం పై  సమీక్ష చేయడం నాకు లభించిన సదావాకాశం గా భావిస్తున్నాను. 
ధన్యవాదములు. 
పుస్తక సమీక్ష
ఐశ్వర్య రెడ్డి గంట.

కామెంట్‌లు