నీ సమక్షాన-బి. -హరి రమణ-కలం స్నేహం
మూసిన అరమోడ్పు కన్నులలో
ఓ మౌనం
 నీలి నీలి  నయనాల సంగమ గీతం
ప్రేమ అమృత  వర్ష ధారలై 
వలపు మడుగులై నీ చూపులతో నన్ను తడుముతుంటే....

నడిరేయి జాము జామున ఉలికి పడు వేళ
నా ప్రణయ సౌరభ తొలి పులకరింతలు
ఊట బావిలోని తేనెల సోనలై
 మదిని తాకుతూ మయూర పింఛమై

నా  ఆశల లోగిలిలో నిను కాంచక
యుగయుగాలుగా నీకై వేచి ఉన్నా

నిన్ను చేీర లేని నా నిస్సహాయత
ఇరువురి మధ్య అమలిన శృంగార వీచికలకు బృందావన తీరమే సాక్ష్యం
దరులు వేరైనా ....

కాలం నిన్ను నన్ను  విసిరికొట్టి నా
నీ మురళీగానం మంజుల సుస్వర నాదం
నా లోజీవమై    నన్ను నడిపించు
ఇలలో ప్రేమకు మనమే కాదా  నిర్వచనం

నీ సమక్షంలో గడిపే కొలది ఘడియలు
 నాలో  జన్మకు చాలినంత మధురిమలు నింపు

నీ చిరు స్పర్శ మేేను కు పరవశమై
మనసు గాయాలకు చందనపు పూత లై
నన్ను అలరించు
నీ సుందర రూపం నా కనులలో ఇలాగే ఉండి పోనీ
మోహనా శిఖి పింఛ మౌళి .....


కామెంట్‌లు