గతమంతా గాయాలే;-వేముల ప్రేమ లత--కలం స్నేహం
 నీవన్నావు గుర్తుందా?
నీవూ నేనూ ఏనాటికీ కలుసుకోలేని సుదూర 
తీరాలం అని
అందుకేనా కంటికి అందనంత దూరం వెళ్ళావు?
మనసంతా మౌనంతో,
 గతమంతా గాయాలతో నింపేశావు
నీ వునికే జ్ఞాపకం గా మిగిల్చి వెళ్ళావు
ఏ టైమ్ గుర్తొస్తావ్ అంటే ఏం చెప్పను?
అసలు మర్చిపోతే కదా గుర్తు రావడానికి
గతం వెంటాడుతూ భవిష్యత్ శూన్యంలా
కనిపిస్తుంది
అదేంటో కొన్ని పరిచయాలకు కారణం తెలియదు
కొన్ని సమస్యలకు పరిష్కారం లేదేమో
రోజూ సాయంత్రాలు వచ్చీ పోయే రైళ్ళను చూస్తూ ఉన్నా
ఏదో ఒక రైలులో నువ్వు  రాకపోతావా అని
డాబానెక్కి మేఘాలను చూస్తూ ఉన్నా
ఇక్కడున్న మేఘం ఏదో ఒకరోజు
 నా కన్నీళ్లను నీ ఇంటిముందు వర్షంలా కురిపించక పోదా అని
ఒక్కసారి వచ్చి కనిపించి పోరాదూ
మిగిలిన ఈ జీవితం అంతా ఏదోలా….
 ధైర్యంగా బతికేస్తా

కామెంట్‌లు