బొమ్మను. గీద్దామాపిల్లలూ...!>బాలగేయం;-కోరాడ నరసింహా రావు. >విశాఖపట్నం
బొమ్మను గీద్దామా పిల్లలూ... 
 
బొమ్మను  గీద్దామా... !

బొమ్మను వేసి..... దానికి చిక్కని 
రంగులు వేద్దామా!!

దూరంగా ఓ బోడి కొండను.. 
ఆకొండ వెనుకనుండి తొంగి చూచు... 
ఉదయ భాస్కరుని ,
కొండనానుకుని పచ్చని పైరు తో పంట పొలాలను.....! 
ఆ పొలాల ప్ర

క్కన అందమైన 
కోనేటి గట్టును...
ఆ గట్టు మీద ఒక ఈత చెట్టును...
చెట్టు కొమ్మ నొక చిలకపిట్టను
ఆ పిట్ట నోటనొక ఈతపండును

చక్కగ గీద్దామా... !
చిక్కని రంగులు వేద్దామా... !!

బొమ్మను గీద్దామా పిల్లలూ... !
బొమ్మను గీద్దామా......... !!
కామెంట్‌లు