గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్నకు ఘన సన్మానం; మొలక


 పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు ,బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు, నూతన విద్యాకవిటీ చైర్మన్ ,పురప్రముఖలు మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. సన్మాన గ్రహీత గద్వాల సోమన్న 'బాలసాహిత్య రత్న' జాతీయ విశిష్ట పురస్కారానికి ఎంపిక కావడమే కాకుండా బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తూ, తెలుగుభాషకు వన్నె తెస్తూ పలు పుస్తకాలు వ్రాసి,జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని మురవణి పాఠశాల కు ,పెద్దకడబూరు మండలానికి  కీర్తిప్రతిష్ఠలు,గుర్తింపు తెస్తూ, అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.కవిరత్న గద్వాల సోమన్న మాతృభాష  తెలుగుకు చేస్తున్న కృషిని అందరూ అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,విద్యా కమిటీ చైర్మన్ శివన్న,ఉపాధ్యాయులు శివనాగజ్యోతి,జయరాజు,లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, రాజశేఖర్, హస్ర పున్నిసా బీబీ, తాయప్ప,ఆంజనేయులు గారులు , గ్రామస్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌లు