వంతెన - బాల గేయం ;-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
అదిగో చూడు వంతెన 
మనుషుల బంధం వంతున!

రాకపోకల రహస్యం 
కింద కాలువ ప్రవాహం 

శ్రామిక జీవన భాగ్యం 
సరళ సుందరం యోగ్యము 

తూర్పు పడమర రవికిరణం 
వ్యాపారంలో శుభ తరుణం 

పాలు పెరుగు పట్నంకమ్మి 
దినసరి సరుకుల లభ్యం 

వంతెన పురాణ సూత్రం 
వానర సైన్యం చిత్రము 

మనసుల వంతెన వేద్దామోయ్ 
మనిషికి సాయం చేద్దామోయ్!!


కామెంట్‌లు