చిన్మయ మౌనభాష;-కె. ఆర్ భార్గవిల-కలం స్నేహం
తలచిన తలపులు  తుళ్ళిపడుతుంటే 
ఎదలో  కలవరం ఎదురు గా వస్తే ..
కనులు మూసినా తెరచినా రెప్పల వెనుకనే స్వప్నలై ..
మధుర స్మృతులు  స్మరించగా ..

మనసు కనులు తెరచి
మౌనంగా లిఖిస్తున్నా
కనులతో చూడలేని నీమనసు రూపాన్ని..
చిరుగాలి మురిపపు ఊసులు
మోసుకొచ్చిన సున్నితనై..

తమకపు అల్లరిలో తనువుని
అందుకుని ప్రేమ గమకాలు 
వల్లిస్తున్నా..

చెక్కిలిపై చిందే సొగసుల సాక్షిగా 
అదరాలపై విరిసే దరహాస
విరులను అందివ్వాలని..

వేకువ వరకు వడిసిపట్టి
మది కడలికి మళ్ళించి
నా (భా)బావ కెరటాలకు
వెన్నెల సొబగులు అద్ది అభిషేకిస్తున్నా మనసారా..

మరి 
ఇది తపనో..తన్మతనో
ఊహో తెలియని పరవశాన
మనసు మయూరి లా నర్తిస్తుంటే
ఎదలయల సవ్వడిని వర్ణించ
ఏ భాష కలదో భువిపై
చిన్మయ(ఆనంద) మోము పలికే 
మృదువైన మౌన బాస కు తప్ప..


కామెంట్‌లు