బ్రతుకుబాట ..!! >పోలీసులు..!పోలీసులు..!!; కోరాడ నరసింహరావు >విశాఖపట్నం .

  ఆ సారాకొట్టుముందు మసాలా పళ్లెం పెట్టుకుని...గతాన్ని తలచుకుని.....
తలచుకుని ఏడ్చే వాడిని !
బొబ్బిలి అమ్మమ్మగా రింట్లో గడిపిన రోజులుగుర్తుకువచ్చేవి. అక్కడ అమ్మమ్మ వేడి - వేడి ఉడికించిన కోడిగుడ్డు ఇచ్చేది 
*అలబొద్దు*  అనిచెప్పి... 
వేడి చోడిపిండి 'తోప'లో బెల్లం ముక్కపెట్టి ఒకోమారు...పాలు
పోసి ఒకోమారు ఇస్తుండేది !
అక్కడ మా చినతాతగారి ఆఖరి కొడుకు వెంకటరావు... 
నాకన్నా ఓ నెలే పెద్ద !
మేమిద్దరంకలిసి ఆ ఇంటి పక్కనే ఉన్న రావువారిబంగ్లా లో... వాళ్ళపిల్లలతో పాటుగా 
నాపక్కనేఉన్నషావుకార్లబ్బయ్
మౌళి తోకలిసి ఆడుకునే ఆట ఆడు కోటం .. వాళ్లంతా దగ్గరలో ఉన్న నేల నూతిలో ఈతలు కొడుతుంటే ఉత్సాహంగా చూడటం !
ఇంక మా పార్వతీ పురంలో ఐతే... ఆవీధి పిల్లలందరం కలిసి పక్కనేవున్న మైదానంలో 
ఆటల్లోపడి... ఆకలి, ఇంటి ఇబ్బందులు అన్నీ మరచి పోయే వాడిని !
అక్కడ నేనంటే ఎక్కువ అభిమానించి స్నేహం కలిసిన ఉస్మాన్ భాష నైతే నేనెప్పటికీ 
మరువలేను !
తరువాత భాషా ఆరవతరగతి 
Rcm... బాయ్స్ హైస్కూల్ లో చేరటం... నేనూ అదేస్కూల్ లో 
జాయినవటంతో... ఇద్దరమూ స్కూల్ కి కలిసే వెళ్లే వాళ్ళం !
భాషా క్లాస్ టీచర్ రామ్మూర్తి మాస్టారు దగ్గర ట్యూషన్ చదివేవాడు, నాగురించి కూడా రికమెండ్ చేసాడు మాష్టారు నాకు ఉచితంగా ట్యూషన్ 
చెప్పేవారు... వారు బ్రాహ్మిన్స్ 
ఇంటినుండి వారికి టిఫిన్ వచ్చేది... తను... ఒరే కోరాడా 
ఇలా రా అనిపిలచి ఏమైనా తిన్నావా అని అడిగేవారు !
నేను తల ఊపేవాడిని వెధవ నువ్వేమీ తినలేదు నాకు తెలుసు ఇదుగో తిను అంటూ సగం నాకే ఇచ్చేసే వారు !
   ఇవన్నీ తలచుకుని కుమిలి పోయేవాడిని !సరిగ్గా అప్పుడే 
పోలీసులు..!. - పోలీసులు ..!!అని 
కేకలు వినబడ్డాయి..., 
యజమాని కొట్లో సారా అమ్ము తున్న నా తండ్రి ఒరే పారిపోరా అంటూ... తనదారిన తాను పారిపోయాడు !
నేనూ... ఆ ఇత్తడి పళ్ళెము డబ్బులు అక్కడే వదిలేసి... 
పారిపోయాను !!
                   ******************
                       ...... సశేషం...
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Great survivor.. appreciated sir. Now just be cool and god bless you