మొలకకి దీపావళి జోతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మొలకలో ఎన్నెన్నో రకరకాల 
రంగు రంగుల పూలమడులు!
దివ్యదీపావళిలో వెలుగుతున్న 
ఆనందజ్యోతులు!
పిల్లల చిత్రలేఖన విన్యాసాలు!
పెద్దల బాల్య స్మృతులు!
కథలు గేయాలు పద్యాలు వ్యాసాలు!
విశ్వాన్ని మన ఎదుటనిలిపే
వేదాంత సారం వంటపట్టించుకున్న సూరీడు!
మేరాభారత్ మహాన్ అంటూ
న్యూజిలాండ్ నించి అన్నిలాండ్స్ కి తెలుగు సాహితీప్రభలను వెదజల్లే
అందరిమన్ననలందుకునే
మొలకా!నీవు మాటలునేర్పే
 పంచదార చిలకవు!
తెలుగు శారదామాతచేతిలోని
పచ్చంగ మెరిసేటి చిలుక చిరుమొలకా!
నీకిదే దీపావళి జోతలు!
నెట్ ప్రపంచంలో మేటిగా వెలిగి
అందరినోట పలకాలి నీమాట!
కామెంట్‌లు