171) సమస్త ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగా చూడు.దైన్యం, దౌర్బల్యం, పిరికితనం అప్పుడు నిన్ను సమీపించవు.
172) సంశయాలన్నింటినీ తోసిపుచ్చి,సుస్థిరచిత్తులై మీ గురువుగారి ఆజ్ఞను పాలించడానికి కంకణం కట్టుకోండి.
173) నిష్కామంగా మీ విద్యుక్తకర్మను మీరు చేసినట్లైతే అది సకాలంలో ఫలించి తీరుతుంది.
174) విధేయతా గౌరవమూ శాసించి పొందదగ్గవి కావు.ప్రేమమయ స్వభావం, మహత్తరమైన శీలం ఇవే వాటికి ముఖ్యకారణం.
175) మనోనిగ్రహం లేకపోవడమే జనం బాధపడుతూ ఉండడానికి కారణం.
(సశేషము)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి