*ఉ.మా.-2*
కార్తికమాసమందు తమ*
కమ్మునభక్తిప్రపత్తితోడుతన్!
కార్తిక స్నానమాడుచును*
గంగన, నామలకమ్ముపైనతా!
వర్తులుదానమిచ్చుచును*
భక్తిగ దైవకృపారసమ్ముకై!
కార్తిక భోజనమ్ములను*
కాననమందునజేతురీభువిన్!
*కం.-2*
కార్తీకపురాణమ్మును
నార్తిగనధ్యాయములను*
నధ్యయనముతో!
స్ఫూర్తిగ హరిహరు సేవలు
కార్తికదీపములుదాన,*
ఘనఫలమొసగున్!
*కం.-3*
కాగడహారతులుదయము
సాగునుగుడులందుభజన*
సంకీర్తనలున్!
నేగుచువీధులయందున
పోగుగనగరమునతిరుగి*
పొగడుచుభక్తిన్!
*కం-4*
అమలక స్నానము చేయుచు
నమకము,చమకమ్ముతోడ*
నరహరిహరులన్!
తమకముమీరగకోలచిన
శ్రమయనకనెభక్తిభావ*
సంపద పొందున్!
*కం*
వనభోజనముకువెళ్ళుచు
తనవారినికలిసికొనుచు*
ధర్మయుతముగా!
చనువున నాప్యాయతగను
మనములునుల్లాసమంది*
మహిమాన్వీతమౌ!
కార్తికమాసమందు తమ*
కమ్మునభక్తిప్రపత్తితోడుతన్!
కార్తిక స్నానమాడుచును*
గంగన, నామలకమ్ముపైనతా!
వర్తులుదానమిచ్చుచును*
భక్తిగ దైవకృపారసమ్ముకై!
కార్తిక భోజనమ్ములను*
కాననమందునజేతురీభువిన్!
*కం.-2*
కార్తీకపురాణమ్మును
నార్తిగనధ్యాయములను*
నధ్యయనముతో!
స్ఫూర్తిగ హరిహరు సేవలు
కార్తికదీపములుదాన,*
ఘనఫలమొసగున్!
*కం.-3*
కాగడహారతులుదయము
సాగునుగుడులందుభజన*
సంకీర్తనలున్!
నేగుచువీధులయందున
పోగుగనగరమునతిరుగి*
పొగడుచుభక్తిన్!
*కం-4*
అమలక స్నానము చేయుచు
నమకము,చమకమ్ముతోడ*
నరహరిహరులన్!
తమకముమీరగకోలచిన
శ్రమయనకనెభక్తిభావ*
సంపద పొందున్!
*కం*
వనభోజనముకువెళ్ళుచు
తనవారినికలిసికొనుచు*
ధర్మయుతముగా!
చనువున నాప్యాయతగను
మనములునుల్లాసమంది*
మహిమాన్వీతమౌ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి