బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 206) మందలో ఒకరిగా ఉండకు.వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు.
207) ప్రతీ గొప్పకార్యం అవహేళన, ప్రతిఘటన,తర్వాత అంగీకారం అనే మూడు మజిలీలగుండా సాగిపోతుంది.
208) నారాయణుని చేరుకోవాలంటే దారిద్ర్యం అనుభవిస్తున్న కోట్లాది దరిద్రనారాయణులకు సేవచెయ్యాలి.
209) అభివృద్ధికి లక్షణం అన్యమతాభిప్రాయ గ్రహణం, సమన్వయం. ఇదే సనాతనధర్మ సహజ లక్షణం.
210) నిజమైన ప్రేమ ఔన్నత్యాలకు సర్వులూ వంగి నమస్కరిస్తారు.
(నేను సేకరించిన స్వామీ వివేకానంద సూక్తులు సమాప్తం)



కామెంట్‌లు