గీతాంజలి ;- రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 .2 “గానమే నా అర్హత నీ సమక్షాన"

నన్ను పాడమంటూ నీవు ఆజ్ఞాపించినప్పుడు నా హృదయం పొంగిపొర్లి గుండె దడదడలాడటం జరిగింది. అప్పుడు నా కళ్ళు నీటిసుడులుగా మారాయి. ఆ స్థితిలో నా గళంలోని అపస్వరాలన్నీ కరిగి ఒక మధురస్మృతిలో లీనమయ్యాయి. ఆ స్మృతులు బాధలకు దూరంగా సముద్రం మీద ఎగిరే పక్షిలా రెక్కలు చాచుకున్నాయి.అప్పటికి భక్తునికి తన పాటపట్ల కొంత ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఇలా అంటాడు. స్వామీ నా భక్తి పాటలు నీకు ఆనందమని తెలుసు. ఇలా పాడగలిగిన పాటే నీ ఎదురుగా నేను నిలవగలిగిన అర్హతను సంపాయించి పెట్టిందని భావిస్తున్నాను. పక్షితన రెక్కలను విశాలంగా చాచినట్లుగా నేను పంచమశృతిలో నా పాటను ఆలపిస్తాను. ఆ భావావేశంలో పరవశమై నన్ను నేను మరిచిపోతాను. నువ్వు నాకు ప్రభువు అన్నమాటను మరిచిపోయి నీ పట్ల స్వతంత్రతను పెంచుకొని 'సఖా' అని పిలుస్తాను...



కామెంట్‌లు
JK చెప్పారు…
Wonderful! The poem portraits how devotion develops bonding between God and devotee. Amazing painting too