గీతాంజలి ; --రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు


 3. సజీవరాగాల వల సృష్టిక్రమాన్ని అద్వితీయ 'రాగం'గా కవి వర్ణిస్తున్నాడు. ఆ 'రాగం' తనకు అద్భుతంగా తోచి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటాడు భక్తుడు. అయితే ఈ రాగలయ తనకు అర్థం కాకపోయినా సమస్త జీవకోటికి జీవనవెలుగును ప్రసాదిస్తూ భూమి, ఆకాశం అంతటా నిండి అన్ని అడ్డంకులను ఛేదిస్తూ ఆ రాగలయ ప్రవాహం సాగుతుంది. ఎలాగైనా ఈశ్వరరాగంలో కలిసి పోవాలని, నా హృదయం పరితపిస్తుంది. నేను కూడా పాడాలని ప్రయత్నం చేసి, నా ప్రయత్నానికి పాటరూపం రాక దుఃఖితుడను అవుతున్నాను. ఏమీ తోచక ఈ సజీవరాగాల వలలో నన్ను బందీగా చేశావు గదా ప్రభూ! విశ్వగానలయలో నేను 'లయం' కావాలనే ప్రగాఢమైన కోరిక నెరవేరలేదనే బాధతో విలవిలలాడుతున్నాను.


కామెంట్‌లు