గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు


 13. " పాడవచ్చిన పాట పాడలేనైతి"

నేను పాడాలనుకున్న 'పాట' పాడలేక పోతున్నాను. సందేహాల సవరణలతోనే కాలమంతాకరిగి పోతుంది. ఆ పాటకు తగిన లయబద్ధత అమిరే సమయం రావటం లేదు. అయితే పాడాలనే కోరిక మనసంతా నిండి అల్లకల్లోలం చేస్తుంది. పువ్వు ఇంకా మొగ్గ దశలోనే వున్నది. గాలి దాన్ని స్నేహానికి రమ్మంటుంది. ఆయన రూపంగానీ, ఆయన గొంతుగానీ, ఎలా వుంటుందో ఎరుగను. కానీ, నాఇంటి ముందు ఆయన అడుగుల చప్పుడు విన్నాను. నా నేల పడక వేళకు జీవిత కాలమంతా గడిచిపోయింది. నా అజ్ఞానం, అంధకారాలు తొలిగించే జ్ఞానకాంతిని వెలిగించుకోకుండా చీకటితో నిండిన నా శిథిలగృహము (దేహము) లోకి భగవంతుణ్ణి ఎలా స్వాగతించను? ఇప్పటికీ ఆయనతో నాకు ప్రాప్తించని కలయిక కోసమే నేను జీవించి ఉన్నాను.


కామెంట్‌లు