*సూక్తి పద్యమాల* *(తేటగీతులు)*;-*మిట్టపల్లి పరశురాములు*
 అదుపులేనట్టియిచ్ఛలు-యవనయుండ
మనసులోనికిరాకుండ-మనగవలెను
సుఖపుజీవనమెప్పుడు-జూడమనము
ఇచ్ఛజయించినడవాలి-యిష్టముగను

నీతినియమాలుయెదలోన-నిండుగున్న
మనుజడెందమురమ్యమై-మహినివెలుగు
నడతయందునకన్పించు-నరులుమెచ్చ
గుణమువెలుగునుమనలోన-గుర్తుగాను


కామెంట్‌లు