నెచ్చెలి-స్వర్ణలత--కలం స్నేహం
నీలినీలి కళ్ళతోని కవ్విస్తూనే...
నిమీలిత నేత్రాలతో ఆహ్వానిస్తూనే
నేర్పుగా జారుకుంటావే
నా నవ్వుల నయగారమా
నీ అడుగులో అడుగు వేసిచేరలేనా

నోరూరించే లడ్డూ లాంటి చిన్నది
నువ్వే నా ప్రాణమంటూ ప్రదేయపడితే
నాన్చే ప్రవరాఖ్యుడను కానులే...
నీ అందచందాల ఆస్తిపాస్తులకు
నీడలా చేరి కాపుకాసె కంచెనవుతాను
నిన్ను సొంతం చేసుకుని జన్మజన్మల బంధమౌతాను

నూనుగు మీసాల నూతన యవ్వనమంతా
నీ సొంతం చేయగా నీ దాసుడవనా
నదిలా సాగే నీ హొయలన్నీ...
నాలో చేరి సాగరసంగమమై మిగిలి
నవలోకానికి స్వాగతం పలికి...
నమ్మకాన్ని నిలబెట్టుకోనా...
నెచ్చెలి కన్నులలో దాగిపోనా...
నిత్యం నీ ఒడిలో వాలిపోనా


కామెంట్‌లు