;;; ఆ రోజుల్లో : - k జోగారావు
 మనకు  జీవితం మొదటి భాగంలో తారస పడే   వ్యక్తులు మరి కొన్ని   సంఘటనలు  మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మనకు తెలియకుండానే మనం ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకుంటాం. వాటి వల్ల ప్రభావితం అవుతాము.
 అలాంటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న నా స్నేహితుని తండ్రి గారి గురించి  ఇక్కడ   పరిచయం చేస్తాను..
 మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా స్నేహితుడైన కామేష్ ఇంటికి తరచుగా  వెళ్ళడం జరిగేది.  వారి నాన్నగారు రెండు జిల్లాల కి అధికారి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్  బెంగుళూరు లో పట్టా  పుచ్చుకున్నారు.  సర్ సి.వి. రామన్ గారి శిష్యులు .  ఆరడుగుల ఎత్తు ఆజానుబాహుడు.  అచంచలమైన విశ్వాసం కలిగిన  విజ్ఞానఖని  అని చెప్పాలి.    క్రమ శిక్షణ లో మాత్రం చండశాసనుడే .
l
 సెలవు దినాల లో  అప్పుడప్పుడు  కామేష్ ను  కలవడానికి, వాళ్ళ ఇంటికి వెళ్లడం మాకు ఒక పెద్ద సమస్య.   కారణం   అక్కడ వాడి నాన్న గారు.  ఆయన ఆ సమయం లో  ఉంటే మాత్రం  దిన గండం నూరేళ్ళు ఆయుష్షు లాగా ఉండేది.   వాళ్ళ నాన్నగారి కంట పడితే   ఇంక అంతే సంగతులు. 
 మాకు బొత్తిగా  తెలియని ప్రపంచ జ్ఞానం మీద  ఎన్నో ప్రశ్నలు వేసి ముప్పుతిప్పలు పెట్టే వారు.  మేము వెళ్ళినప్పుడు వారి నాన్నగారు ఇంట్లో  ఉండకూడదని దేవుడి ని ప్రార్ధించు కుంటూ వెళ్ళేవాళ్ళం..
 ఒక రోజు ఇలాగే వెళ్లి  మేము ముగ్గురు  స్నేహితులం  వారి ఇంటికి  కాస్త దూరంలో నిలబడి నాన్నగారు ఉన్నారో లేదో అని అంచనా వేస్తూ , ఇంటిని  గమనిస్తూ నిలబడ్డాం.
 ఇంతలో వాళ్ళ నాన్నగారు బయటకి వచ్చి మా వైపు చూస్తూ" ఒరే  దొంగ వెధవల్లారా రండి ఇటు " అని  రమ్మని  చేయి ఊపి నిలబడ్డారు.  బాబోయ్ దొరికిపోయాం అనుకుంటూ మేము చాలా సీరియస్ గా నడుచుకుంటూ  వెళ్లి నమస్కారం పెట్టి న  తర్వాత ఆయన మమ్మల్ని చూసి
"  ఏరా !!  దొంగ కోళ్లు పట్టే వాళ్ళలాగా అక్కడ నిలబడి ఏం చూస్తున్నారు, ఇంట్లోపలికి   తగలబడచ్చు కదా" అన్నారు .  మేం   బిత్తరపోయిపోయి ,  బిక్కమొహంమొహం వేసుకుని రాని  నవ్వు  నవ్వుకుంటూ లోపలి కి  చేతులు కట్టుకుని వెళ్లి పోయాం. ఆ విధంగా అన్నీ గమనించేవారు.  
 సాయంకాలం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత భార్యను ,పిల్లలను కూర్చోపెట్టుకుని అందరూ కబుర్లు చెప్తూ ఉంటే వాడి నాన్న గారు  కొద్దిగా వైన్   తీసుకునేవారు.   ఆ సమయంలో పని ఒత్తిడి పూర్తిగా మర్చిపోయి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ  పిల్లలతో సరదాగా గడిపేవారు.  మాకు డిగ్రీలు పూర్తయ్యే సమయానికి ఆయనకు కడప కు ట్రాన్స్ఫర్ అయింది. 
 కుటుంబమంతా అక్కడికి మకాం   మార్చేసారు.   ఇద్దరి కొడుకులను ,అంటే మా స్నేహితులను ,నిజాంబాద్ లోని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ,అందులో అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోయారు.   ఆ ఇంటి బాధ్యత,  అంతా కూడా చిన్న కొడుకు కామేష్ కు  అప్పజెప్పాడు.  మేము  కాలేజీలో అమ్మాయిలతో కలిసి వేసుకునే  పి క్నిక్లు, సినిమా కార్యక్రమాలకి అయ్యే ఖర్చు , పాపం ఎక్కువగా కామేష్ భరించేవాడు.  ఎందుకంటే అవి భరించడానికి మా ఆర్థిక స్తోమత సరిపోక పోయేది. మమ్మలిని తిడుతూ , వాడు తప్పనిసరిగా పాకెట్ లో నుంచి పర్సు తీసి నవ్వలేక నవ్వుతూ అమ్మాయిల   ముందు చాలా స్టైల్ గా ఖర్చు పెట్టేవాడు. ఆ సమయంలో మమ్మల్ని చూసి గుర్రుమనే వాడు. మేమది చూసి ఫుల్లుగా నవ్వు కునే  వాళ్ళం.
  రెండు నెలలు గడిచిన తర్వాత  వారి నాన్న గారు  రూమ్ కు చెప్పా పెట్టకుండా రావడం జరిగింది 
అది తెలిసి ఆ  రోజు సాయంత్రం మేము భయపడుతూనే వాడి గదికి వెళ్ళాము .   మేము వచ్చిన సంగతి గమనించి  వాడు  ఇంటిబయటకు వచ్చాడు . మొహం , కళ్ళు  అంతా ఉబ్బి పోయి ఉన్నాయి. బాగా ఏడ్చినట్లు తెలుస్తోంది.
మేము కంగారు పడి "ఏంట్రా అలా అయిపోయింది  నీ మొహం ? ఏంటి సంగతి"? అని అడిగాము .  " వెధవల్లారా , మీరు చేసిన పనికి ,నాకు మా నాన్నగారు ఉదయం నుంచి వాయించి  పెట్టారు.  మీరేమో  అన్నిటికీ నాతో ఖర్చు పెట్టిస్తారు. ఇప్పుడు  ఏం జరిగిందో చూడండి  .....నే వ్రాసిన  దొంగ లెక్కల ఖర్చు మా నాన్న పట్టుకొని, వాయించేసాడు . 
నూనె ఖర్చు పది లీటర్లు రాసాను. అక్కడ దొరికి పోయా ". అన్నాడు కోపంగా .
"ఏరా మీ ఇద్దరికీ ఒక నెలలో 10 లీటర్ల మంచి నూనె ఖర్చయింది!!. ఏం చేస్తున్నారు? ప్రతిరోజు తలంటుకుంటూ  ఉన్నారా? లేక ఒంటికి మర్ధన చేయించుకుంటున్నారా? .  దొంగ వెధవల్లారా!  దొంగ లెక్కలు!!!   ఇంకోసారి ఇలాంటివి చేస్తే  కాళ్ళు  విరక్కొడతాను " అని దొబ్బులు పెట్టాడుట .. 
"ఈ విధంగా, చాలా  దొంగ లెక్కలని పట్టేసుకున్నాడు"    అని చెబుతూ ఏడుపు మొహం పెట్టాడు.
 అది విని మేము  పగలబడి నవ్వి  " అయినా దొంగ లెక్కలు చాలా కరెక్ట్ గా ఉండాలి రా! నెలకు పది లీటర్ల నూనె  ఏంటి ?అసలు నీకు బుద్ధి లేదు, అవునూ, అన్నట్లు  నువ్వు కామర్స్ విద్యార్ధి వి, పైగా కాలేజీ లో టాప్ ర్యాంకర్ వి కదా  , మరి  లెక్కల్లో  ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేవా ? వేస్ట్ ఫెలో." అని వాడి ని  తిట్టాము. 
 కాలేజీ  పరీక్షలు అయిపోయిన తర్వాత  ఇల్లు ఖాళి చేసి అందరూ  కడపకు వెళ్లి పోయారు.  ఇక మాకు నిరుద్యోగ పర్వం మొదలయ్యింది .  ఆ సమయం లో ,నేను ఒక  మారు వాడి ఊరికి వెళ్లా.  రాత్రంతా రైలు  ప్రయాణం చేసి ,ఉదయాన్నే కడప స్టేషన్ లో దిగాను .
అలా ఉన్నఫలంగా, ఆ  ఏబ్రాసి రూపంతో వెళితే వాళ్ళ నాన్నగారు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వరు అని  నాకు తెలుసు. అందుకని రైల్వే స్టేషన్ లో స్నానాలు చేసి కొత్త ఇస్త్రీ  డ్రెస్ వేసుకుని ఇంటికి వెళ్ళాను.  ఇంటికి వెళ్లి  నమస్కారం పెట్టగానే ఆయన నన్ను ఆప్యాయంగా పలకరించి లోనికి పంపారు . 
స్నేహితుడు  కామేష్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు .ఇలా ఇంత ఫ్రెష్  గా  ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు ఈ ఊరికి , ఎలా వచ్చావు " అని  ప్రశ్నలు వేసాడు .
"ఫ్రెషా ? నీ మొహం . స్టేషన్ లో దిగగానే ,అక్కడే  స్నానం చేసి ,బట్టలు మార్చుకొని వచ్చాను ,మీ నాన్నగారి భయానికి " అని చెప్పాను.  అది విని వాడి  అన్నయ్య, అమ్మగారు, అక్కయ్య అందరూ తెగ నవ్వారు.  
మరుసటి రోజు మేము భోజనం చేస్తూ ఉండగా ఎవరో  వ్యక్తి బయట నుంచి కామేశ్వర్  నాన్న గారిని  పిలిచాడు. ఆయన  లేచి వెళ్లి  గుమ్మం దగ్గర నిలబడి  అడిగారు " ఏంటి బాబు? ఎవరు నువ్వు ?ఏం కావాలి ? "అని.
ఆ వచ్చిన వ్యక్తి  " వుద్యోగం  గురించి వచ్చానండి. మిమ్మల్ని కలవ  మన్నారు"  అన్నాడు .
"ఉద్యోగాలు  నేను  ఎక్కడి నుండి తేవాలి ? ఇదిగో  ఇలా చూడు..మా ఇంట్లోనే ముగ్గురు  బాగా దున్నపోతుల్లాగా  తిని తిరుగుతున్నారు. వీళ్లకే  ఉద్యోగాలు లేవు ఇక నీ కెక్కడ నుంచి  ఇవ్వాలి ?" అని  హాయిగా తింటున్న మమ్మలిని  కొర కొరా చూసి లోనికి వెళ్లి పోయారు.
" ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుగా , వాడెవడో ఉద్యోగానికి వస్తే మమ్మల్ని వాయించటం ఎందుకు"  అని  కామేష్ గొణిగాడు.
" అయినా ఆ వెదవ ఎవడో మేము  తినే సమయానికె   రావాలా ? వాడెవడో  రావడం ఈయన అదే అదే పనిగా మిమ్మల్ని తిట్టడం " అంటూ  అందరం గొణుక్కుంటూ తినడం మొదలుపెట్టాము. వాళ్ళమ్మగారు ఒకటే ముసి ముసి నవ్వులు మా బాధ , ఉక్రోషం చూసి.
    మరుసటి రోజు ,అక్కడ ఉన్న భీమా సంస్థ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పటం వలన పుత్ర రత్నాలను ,అంటే,  కామేష్ ,శ్రీనివాస్  , వారితో నన్ను కూడా  వాళ్ళ నాన్న గారు కారులో  తీసుకుని వెళ్లారు.  అందరికంటే ముందుగా కారు దిగిన  నేను , కార్  వెనక   తలుపు తీసి వాళ్ళ నాన్నగారు దిగడానికి అనువుగా ఒక  పక్కకు నిలబడ్డాను .నేను   కార్ తలుపు తీయటం  చూసిన వాళ్ళ నాన్నగారు  కార్ దిగి ,ఆశ్చర్యంగా నన్ను  ఆపాదమస్తకం ఒకసారి  కళ్ళతో  కిందా  మీదా  చూసి  , కొడుకుల వైపు తిరిగి  "ఒరేయ్  !!    ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.  వీడు జీవితంలో చాలా పైకి వస్తాడు. వీడు సక్సెస్  అవుతాడు. " అని చెప్పి  సీరియస్ గా ఆఫీస్ వైపు అడుగులు వేశారు.
ఆ మాటలు విన్న నేను ఆశ్చర్యంతో తలమునకలయ్యా.  
ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు , నేను  నిరుద్యోగ  సమయంలో ఎన్నో ఇబ్బందులను గెలిచి నప్పుడు  కూడా ఆయన అన్న మాటలు గుర్తుకు వచ్చి విపరీతమైన మానసిక ధైర్యాన్ని పొందాను.  ఉద్యోగ ప్రయత్నాలలో నేను విజయం సాధించ లేనప్పుడు కూడా ఆయన అన్న మాటలు గుర్తుకు  వచ్చి అవి ఒక మంత్రం లాగా నా మీద పనిచేసి  విజయం వేపు  సాగేలా చేసేవి.  ఆయన మాటల్ని నేను పూర్తిగా నమ్మాను. మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి,  కుటుంబ పరిస్థితుల మూలంగా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.  కానీ ప్రతి సారి కూడా ఎప్పుడో ఒకప్పుడు  ఆయన అన్న మాటలు మనసులో మెదిలి ,అవి తిరిగి నేను ఉత్సాహంతో పనులు చేసుకోవడానికి   దోహదం చేసేవి.
ఆయన అన్న మాటలు నిజం చేసాను .భయంకరమైన బీదరికం అనుభవించిన  నేను మంచి వుద్యోగం లో నిల దొక్కుకుని, కార్లు , విమానాలలో తిరిగే స్థాయి కి ఎదిగాను. దాదాపుగా  నాలుగు దశాబ్దాలు దాటినా కూడా  ఆ  మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారు మ్రోగుతూ  నే వున్నాయి.
 అందుకే అన్నారు  పెద్దల మాట చద్ది మూట అని. 
కొద్ది కాలం కింద ఆయన పరమపదించారు. ఆయనకు నా  హృదయ పూర్వక నమస్సుమాంజలులు. వారి పేరు శ్రీ కె.జోగా రావు గారు.
విశాఖపట్నం వాస్తవ్యులు..విద్యుత్ శాఖ లో  చీఫ్ ఇంజనీర్ గా రెండు జిల్లాలకు విధులు నిర్వ హించారు.


కామెంట్‌లు
Vikran s rao. చెప్పారు…
It was very hard struggle after I passed B.Tech. Almost 10 years again I invested in studies M.Tech(Full time) and Ph.D. (Full time) by doing part time teaching 😀(I wanted to be independent did not want take help from my father). Now happy from last 3.5 years forgot struggle 😀. Leading very happy life. Yes Sir there will be times that test you ups and downs. We have to receive all. Really you are writing is so impressive Sir. Keep writing. Vikram professor physics. Mumbai
రమణి రమ్య చెప్పారు…
ఈ సారి మీ అంచనా సరిగ్గా అయింది😋, great person, అప్పటి వాళ్ల అభిమానం, మిరియాల ఘాటు లా ఉండేది, మీ ఫ్రెండ్ ఏ రంగంలో సెటిల్.. అయ్యారు
Ramani ramya
Give empl. Khammam
Dr kokkonda sudhaker. Professor చెప్పారు…
[14/11, 15:26] Dr K SUDHAKER: Good afternoon Sham 🙏
Great friendship and experience. Fantastic remembrance 👌
I remember Kamesh joined in MPC in 2nd year. Became jr in GGC and did bcom. 👏👍
[14/11, 16:21] Dr K SUDHAKER: It struck me when Sri joga Rao sir blessed you that you will come up in life.
It’s true blessing never go waste.
Hindu philosophy. Says
Telugu- asheerwadam ku minchina aasthi ledu. 🤝
M రవీంద్రారెడ్డి. Industrialist. Hyd చెప్పారు…
You remembered it as well as looking into it with inspirational motive, that's the game changer and builds confidence. adopting applying is the most innovative thing that you achieved. Goodluck, you deserve it and got it.
Vijay kandala. Dubai చెప్పారు…
🙏 Super ga rasaru uncle
: Yesterday was tatagaru bday.
My parents marriage anniversary too
Mahajan dhanpal omprakash చెప్పారు…
Great experience shared, very nice, I read yesterday, good.👌👍🙏
Kamesh kandala. Hyd చెప్పారు…
Shyam chaala bagundi. 👌
Unknown చెప్పారు…
ముగ్గురు కొడుకుల మిత్రునిగా నేను "జోగారావు"గారికి సుపరిచితమే.!జోకులు వేస్తూ గారం చేస్తూ ఏయ్ అని గాండ్రిపు గా ఉచ్చకంఠంతో మందలిస్తూ ఆయనతో లవ్లీ గా తిట్లు తిన్న రోజులు ఇప్పటికీ ఎప్పటికీ మరచిపోలేని సంఘటనలు సరదాగా గడిపిన క్షణాలు ఎన్నో మరెన్నో వున్నాయి.వాచకం...వాలకం లోనే కాదు ఆయన మేనరిజమ్స్ తో పుణికి పుచ్చుకున్నారు నా మిత్రత్రయం శ్రీను..కామేష్..రవి.!వాళ్ళ నాన్నగారిని ఆయన
జమానాను తలపిస్తూ.!అంత వ్యక్తిత్వం గల మనిషి మన మధ్య జ్ఞాపాకల హృదయం లో సజీవంగా వుంటూ మనల్ని
ఆశ్వీరదీస్తూ వున్నారని... విష్ణు.!
K కృష్ణ మూర్తి. LIC hanmakonda చెప్పారు…
బాగుంది సర్ మీ జ్ఞాపకాలు. కొన్ని వ్యక్తిత్వాలను,వ్యక్తులను మరచిపోలేం.
A vijay simha . Secretariat.hyd చెప్పారు…
He was also one of the mentor in your life I hope.
Venkata kashyap .nicobar చెప్పారు…
మధ్య తరగతి జీవితాలు, మనస్తత్వాలు, ఆర్ధిక ఇబ్బందులు అద్భుతంగా వివరించారు. నా జీవితానికి చాలా దగ్గరగా ఉందనిపించిది. మీలో దాగివున్నా రచన కి 👏👏👏👏👌👍💐
Unknown చెప్పారు…
Shyam very good.Really you have written very nicely.Once again I remembered my Dad's funny incidents
పద్మజ కోడూరు చెప్పారు…
పెద్దల మాటలు విని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీకు అభినందనలు సర్. నమస్తే
Unknown చెప్పారు…
మీరు జీవితాన్ని నిజంగా జీవించారు షామ్ సార్, 🙏🙏.
వారణాసి రామకృష్ణ చెప్పారు…
శుభోదయ వందనములు శ్యామ్ కుమార్ గారు. పెద్దల దీవెనలు అందుకొనడం చాలా అదృష్టం. వారు అంటే ఒక్క భయమే కాక, భక్తితో వారి మాటలకు విలువ ఇచ్చిన మీకు ఆ శ్రీరాముడే అండదండైనాడు. మీ స్వీయానుభవం నేటితరానికి మేలు చేస్తుందనే నా విశ్వాసం. నమస్సులు🙏🌹🌺
వారణాసి రామకృష్ణ చెప్పారు…
శుభోదయ వందనములు శ్యామ్ కుమార్ గారు. పెద్దల దీవెనలు అందుకొనడం చాలా అదృష్టం. వారు అంటే ఒక్క భయమే కాక, భక్తితో వారి మాటలకు విలువ ఇచ్చిన మీకు ఆ శ్రీరాముడే అండదండైనాడు. మీ స్వీయానుభవం నేటితరానికి మేలు చేస్తుందనే నా విశ్వాసం. నమస్సులు🙏🌹🌺
Pothireddy నాగేశ్వరరావు చెప్పారు…
మీ అనుభవం..అభివృద్ధి గురించి చక్కగా చెప్పారు! బాగుందండీ!
'పెద్దలమాట చద్దిమూట'👌
అజ్ఞాత చెప్పారు…
శుభోదయ వందనములు శ్యామ్ కుమార్ గారు. పెద్దల దీవెనలు అందుకొనడం చాలా అదృష్టం. వారు అంటే ఒక్క భయమే కాక, భక్తితో వారి మాటలకు విలువ ఇచ్చిన మీకు ఆ శ్రీరాముడే అండదండైనాడు. మీ స్వీయానుభవం నేటితరానికి మేలు చేస్తుందనే నా విశ్వాసం. నమస్సులు🙏🌹🌺
Mv satya ప్రసాద్ చెప్పారు…
ఆ రోజుల్లొ పెద్ద వాళ్లు చెప్పిన మాటలు చిన్నతనం లో మనకు అర్థం కాక పోయినా అందులో జీవిత సత్యం ఉంటుంది . వాళ్లు తరతమ భేదం లేకుండా తమ బిడ్డలను ఇతర బిడ్డలను సమంగా చూసేవారు . క్రమశిక్షణ లో ప్రేమ ఉండేది . కుల మత బేధాలు ఉండేవికాదు. కార్ డోర్ తీసి వారికి దిగడానికి చొటు ఇచ్చినపుడు మీలో వినయం, పెద్దల మీద గౌరవం చూసి " వీడు జీవితం లో పయి కి వస్తాడు " అన్నారు . వారు మిమ్మల్ని తిట్టినపుడల్లా వారి బార్య ముసిముసి నవ్వులు నవ్వారు అంటే ఆమె వారి మాటల్లో ప్రేమ చూసారు. క్రమశిక్షణ లో పెద్దలు చెప్పే మాటలు అపుడు కష్టం అనిపించినా అందులొ తరువాత మీకు జీవిత సత్యాలు కనిపించాయి . అందుకే పెద్దల మాట చద్ది మూట అన్నారు . మంచి జీవిత సత్యాన్ని వివరించారు . .....మదనంబేడు వి సత్యప్రసాద్ , విజయవాడ
Gottumukkula బ్రహ్మానందం చెప్పారు…
చిన్న తనంలో పెద్ద వాళ్ళు,గురువులు, ఇతర శ్రేయోభిలాషులు అన్న మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో దాదాపు నిజమే అవుతాయి.నేను 1972లోనే ఉపాధ్యాయ పదవిలో ప్రవేశించాను.1974లో 7 వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతూ " జీవితంలో కష్టాలు వస్తుంటాయి.అయితే వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు చెయ్యాలి.అంతే కాని కేవలం సుఖపడటానికి ప్రయత్నించ కూడదు." అని చెప్పానని అమెరికా లో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ని స్థాపించీ మూడు దేశాలలో ఏడు బ్రాంచీలలో,ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన నా పూర్వ విద్యార్థి ఇటీవలే చెప్పాడు. అతను జీవితంలో చాలా కష్టపడి అభివృద్ధి సాధించాడు.కష్టాలు ఎదురైనప్పుడల్లా నా పై వాక్యాలు బలం కలిగించేవని అన్నాడు.2,3దశాబ్దాలుగా అతడు తన కంపెనీకి CEOగా ఉన్నాడు.చిన్నప్పుడు విన్న అనేక మైన మాటలు, బోధనలే అందరికీ మార్గ దర్శకం అవుతుంటాయి. చక్కని ప్రేరణాత్మక రచనకు అభినందనలు.
Gottumukkula బ్రహ్మానందం చెప్పారు…
చిన్న తనంలో పెద్ద వాళ్ళు,గురువులు, ఇతర శ్రేయోభిలాషులు అన్న మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో దాదాపు నిజమే అవుతాయి.నేను 1972లోనే ఉపాధ్యాయ పదవిలో ప్రవేశించాను.1974లో 7 వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతూ " జీవితంలో కష్టాలు వస్తుంటాయి.అయితే వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు చెయ్యాలి.అంతే కాని కేవలం సుఖపడటానికి ప్రయత్నించ కూడదు." అని చెప్పానని అమెరికా లో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ని స్థాపించీ మూడు దేశాలలో ఏడు బ్రాంచీలలో,ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన నా పూర్వ విద్యార్థి ఇటీవలే చెప్పాడు. అతను జీవితంలో చాలా కష్టపడి అభివృద్ధి సాధించాడు.కష్టాలు ఎదురైనప్పుడల్లా నా పై వాక్యాలు బలం కలిగించేవని అన్నాడు.2,3దశాబ్దాలుగా అతడు తన కంపెనీకి CEOగా ఉన్నాడు.చిన్నప్పుడు విన్న అనేక మైన మాటలు, బోధనలే అందరికీ మార్గ దర్శకం అవుతుంటాయి. చక్కని ప్రేరణాత్మక రచనకు అభినందనలు.