సహకారం ;భరద్వాజరావినూతల 9866203795

 సాహితీబృందావనవేదిక ప్రక్రియ-సున్నితంరూపకర్త -నెల్లుట్ల సునీత 
**********
3️⃣2️⃣1️⃣)
మానవత్వపు గుండెలో పూస్తుంది 
కరుణతో స్నేహభావం పెంపొందిస్తుంది 
కలిసి మెలిసి ఉంటానికి దోహదం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
********** 
3️⃣2️⃣2️⃣)
తరతమ బేధాలు యెరుగనిది 
కులమతాల ప్రశక్తి  లేనిది 
ఆపదలో ఆపన్నహస్తమై  నిలిచేది 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
********** 
3️⃣2️⃣3️⃣)
సహకారం పెంచుంది మమకారం 
మనుషుల మధ్య పెరిగేటిఅనురాగం 
ఐకమత్యానికి అవుతుంది మూలం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
********** 
3️⃣2️⃣4️⃣)
సహకారాన నడుస్తుంది వ్యవస్థ 
దీనితోనెపెరుగుతుంది ఆత్మీయత 
మానవునిలో  పెరిగెను ఉదాత్తత 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
********** 
3️⃣2️⃣5️⃣)
సహకారం కుటుంబానికి ప్రాకారం 
దాంతోనే నిలబడుతుంది కాపురం 
భవిష్యత్తుకు అది నిర్దేశనం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
********** 
కామెంట్‌లు