మట్టి పాట;-పల్లె జీవన శతకం పుస్తక సమీక్ష;-నెల్లుట్ల సునీతకలం పేరు శ్రీరామఖమ్మం
 గుండె కవటాల్ని తాకి పల్లె పలవరించిన పల్లె జీవన శతకం
తెలుగు సాహిత్య ప్రపంచానికి డా" ఏనుగు నరసింహారెడ్డి గారు సుపరిచితులు, స్థిరపరిచితులు, ఆధునిక కవిత్వ విమర్శకులుగా, విశ్లేషకులుగా, అనువాదకులుగా, సంపాదకులుగా, పూర్వపు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా , అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్నారు.కవిగా
ఎన్నో పుస్తకాలు రచించారు.
ప్రపంచ తెలుగు మహాసభలు సమర్థవంతంగా నిర్వహించిన ఘనత వారికే దక్కింది.
పల్లె జీవన నేపథ్యం కావడం వలన రైతు కుటుంబం నుండి  వచ్చిన వారు పల్లె జీవనాన్ని అవగాహన చేసుకుని.విద్యార్థి
దశలోనే పల్లె జీవన శతకం రాశారు.
మట్టి పాట పుస్తకం ద్వారా పరిచయం చేశారు.
తెలుగువారికి పద్యం ఎంతో ప్రీతి పాత్రమైనది, పద్యం లేని తెలుగు భాషను మనం ఊహించలేము, తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఎందరో మహానుభావులు, లోక రీతులను, ఎన్నో నీతులను శతక పద్యాల రూపంలో మనకు తెలియజేశారు. శతకం అంటే నూరు లేక 108 పద్యాల రచన అని మనందరికీ తెలిసినదే ఈ శతకం ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనా సంఖ్యా నియమం, మకుటం చంధో నియమం, రస నియమం, ఆత్మాశ్రయ, కవిత ధర్మం, ముక్తకం, మొదలైన లక్షణాలు కలిగి ఉంటుంది.
తెలుగు సాహిత్యంలో 12వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ శతక ప్రక్రియ, నేటికీ వన్నె తగ్గకండా దేదీప్యమానమై వెలుగుతూనే ఉన్నది. ముఖ్యంగా వేమన శతకం, సుమతీ శతకం, దాశరధి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, ఆంధ్రనాయక శతకం, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని శతకాలు, పండిత పామరుల, నాలుకలపై నాట్యం చేస్తాయి, ఇది ముఖ్యంగా సుమతి, వేమన శతకాలు, తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
ఏనుగు నరసింహా రెడ్డి గారు రాసిన
మట్టి పాట అనే పుస్తకంలో పల్లె జీవన శతకంలో సామాన్యులు కూడా సరళంగా అర్థం చేసుకునే శతక మేలిమిముత్యం, అని చెప్పక తప్పదు. చదివిన ప్రతి ఒక్కరు.
పల్లె జీవితాన్ని ఆవాహన చేసుకుని అనుభవాల, అవస్థలను, దుఃఖాలను, జ్ఞాపకాలను, గుండెలనిండా నింపుకున్న పల్లె జీవన శతకం. పల్లె జీవుల వేదనలను, ఇమిడ్చి చిత్రించారు. ఆటవెలదిలో ఏనుగు నరసింహా రెడ్డి గారు
పల్లె జీవన శతకం మట్టి పాట పుస్తకంలో మచ్చుకు
కొన్ని 

ఆటవెలది లోన ఆటలాడగా లేని
తేటగీతి లోన పాడలేని
తెలుగు పల్లె ప్రజకు తేట పరుతు నేడు
పల్లె బతుకు మాది పాడు గాను..!!
వారు పడుతున్న  వేదనలను, సంఘర్షణలను, సంఘటనలను,
ఆటవెలదిలోన ఆటలాడగలేనంటూ...
తెలుగు ప్రజలకు మాత్రం తేట పరుతును అని ఎంతో ఆర్తితో చెప్తాడు.గుండెల్లో కొట్టుకున్న పదాలివి అంటారు. ఏనుగు నరసింహారెడ్డి గారు జన హృదయాల్లో నిలిచిపోయేలా రాయడం ఏనుగు నరసింహారెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య.
తెలంగాణ భాషలో పలుకుబడులను అత్యంత అద్భుతంగా పలికించారు.ఈ శతకాలలో

తేటగీతి లోన పాడలేను
గట్టు గట్టు తిరిగి  గడ్డికై వెతకంగ
గడ్డి పువ్వు నడుము గడ్డి లేదు
అసులోదులు పనులు  అర్ధాకలి చేత
పల్లె బతుకు మాదిపాడుగాను..!!
నగర విస్తీర్ణం లో భాగంగా చెట్లు, వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పడి.
ప్రకృతిని అడవులను ధ్వంసం చేస్తుంటే
రమణీయమైన నా పల్లె అందాలు పచ్చని పంట పొలాలు నేడు మొడు పారిపోయి మూగగా రోదిస్తుంది. అని
గుర్తు చేస్తారు పాఠకులకు ఈ పల్లె జీవన శతకంలో రాజకీయ, కుట్రలు, కుతంత్రాలు, వ్యవసాయ కూలీల  ఆక్రందనలు, బోర్లు పడక పంటలు పండక రైతులు చెందే సంఘర్షణలు, సమస్యలు, బాధలు,కనిపిస్తాయి.
ముసలితనము లోన ముక్కి మూలిగిన  నాడు
కొడుకులైన గాని కూతురైన
కానారూరి కొచ్చి గడియలైనను కొన్ని
పల్లె బతుకు మాది పాడుగాను..!!
సమిష్టి కుటుంబంలో ఉండే విభిన్న మనస్తత్వాల ను వెలికి తీశారు.
నైతిక విలువల ధ్యాస లేదు సామరస్య ప్రవర్తన లేదు సామాజిక న్యాయం. పట్టదు అని  ఏనుగు నరసింహా రెడ్డి గారు ఆవేదన చెందుతాడు.
చదువుకున్న వాళ్ళు చాదస్తమంటారు
కొడుకుల్ ఏమో ఇంత కూడు నిడరు
ఎవరేమి యన్నా వెనకట్నే బాగుండే
పల్లె బతుకు మాది పాడుగాను..!!
తల్లిదండ్రుల బాగోగులు చూడని
తనయుల ను ఉద్దేశించి.
ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన
అనుబంధాలకు విలువ ఇవ్వని.వారికి
కనువిప్పు కలిగిస్తారు. వెనకటనే బాగుండె అని. పల్లె జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. దయనీయ పరిస్థితిని ఎంతో ఆర్తితో అక్షరీకరించారు.

చూడ చిత్ర మాయే చుక్కలు అంటే ధరలు
ఏట్ల వచ్చే పైస లేవడు తెచ్చే
భూమి ఇవరమంత  భూపాలకులకెర్క
పల్లె బతుకు మాదిపాడు గాను..!!
పల్లెటూరి లో వ్యవసాయం సాగు చేస్తూ పండించిన పంటలు, గ్రామాల్లో లభించే పాలు, పెరుగు, కూరగాయలు, అతి తక్కువ ధరకు  సరఫరా అవుతున్నాయి. వ్యాపారం చేసే వారి దగ్గర అధిక ధరలు ధరలు పెట్టి తెచ్చుకోగా తప్పడం లేదు అని ఊరు పల్లెను తలచుకుని ఇప్పుడున్న పరిస్థితిని. భిన్న దృక్పథాల పల్లెటూరు    ప్రాశస్త్యాన్ని అభివర్ణిస్తారు పల్లె జీవన శతకములో
పట్టు పరిమళమై విజ్ఞాన తరంగమై ప్రతి మదిలో గుబాళిస్తాయి. ఈ పద్యాలు.
సంస్కృతులకు, పల్లె జీవనం తెలిపే ఒక  దిక్సూచి.ముందుతరాలకు
విద్యార్థులకు విజ్ఞాన తరంగాలు ఈ శతకాలు.
 ఏనుగు నరసింహా రెడ్డి గారి కలం నుండి 
ఎన్నో పుస్తకాలను రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.కామెంట్‌లు