గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 45. " సడిలేని అడుగులచప్పుడు” సవ్వడెరుగని అతని పదధ్వని వినలేదా నీవు? ప్రతిక్షణం, ప్రతియుగం, ప్రతిదినం, ప్రతిరాత్రి వొస్తున్నాడు, వొస్తుంటాడు, వొస్తూనే వుంటాడు. నిరంతరం వొస్తుంటాడు. నా మనోతరంగాల భావనా వీచికలలో వివిధ రీతుల నిన్నుగానంచేశాను, స్వరాలన్నింటా సర్వదా ప్రకటితమయ్యే శృతి అతడు వొస్తున్నాడు, అతడు వొస్తూనే వుంటాడు, వొస్తూనే వున్నాడు అని., మధురవసంత పరిమళదినాలలో అటవీ బాటలో నడిచి అతనువొస్తున్నాడు, వొస్తున్నాడు, నిరంతరం ఒస్తున్నాడు ఆషాఢ వర్షమేఘచ్ఛాయల్లో ఆకాశం దద్దరిల్లే మేఘరథ గర్జనల మధ్య వొస్తున్నాడు, వొస్తున్నాడు, వొస్తున్నాడు. బాధ మీద బాధ చుట్టుముట్టినప్పుడు నా గుండెలమీద అతని అడుగుల సవ్వడి లయబద్ధమౌతుంది నాసంతసాన్ని ప్రకాశింజజేసేది ఆయన పాదాల స్వర్ణ స్పర్శే.
      

కామెంట్‌లు