అక్షర నీరాజనం;-ముద్దు వెంకటలక్ష్మి--కలం స్నేహం
తెలుగువారి కవిత్వామృత రసభాండమైన
శ్రీమద్భాగవతకృతికర్త
'మహాకవి పోతన ' ను
కళ్ళకు కట్టినట్లు
సాక్షాత్కరింపజేసిన
చలనచిత్ర దర్శకుడు ;

సాంఘిక దురాచారాలను,
మూఢవిశ్వాసాలను
తూర్పారబట్టిన
'యోగి వేమన 'ను       
మన కళ్ళ ఎదుట నిలిపిన
చిత్ర దర్శకుడు ;

తరతరాలుగా ఆబాలగోపాలాన్నీ
ఆనందవాహినిలో ముంచెత్తుతున్న
నిత్యనూతన నవరసభరిత
చిత్రరాజం ' మాయాబజార్' '  రూపశిల్పి ;

తెలుగు చిత్రసీమలో
ఆచంద్రతారార్కం నిలిచే
అపురూప గీతాల చిత్రాల
నిర్మాత, దర్శకుడు
కదిరి వెంకట రెడ్డి కిదే
కలం స్నేహ కవయిత్రి ఇస్తున్న
 అక్షర నీరాజనం


కామెంట్‌లు
Akondi (Muddu) Venkata Lakshmi చెప్పారు…
నా కవిత ' అక్షరనీరాజనం' ను ప్రచురించినందుకు 'మొలక' అంతర్జాల పత్రిక సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ముద్దు వెంకటలక్ష్మి