మనదేశ భవిత ;- శ్రీమతి నందగిరి రామశేషు.;- కలం స్నేహం
గొప్ప వారి ఆటల వేదిక క్లబ్బు
యువతకు మత్తెక్కించే పబ్బు
రెండింట ఏరులై పారే‌ది డబ్బు
ఇదే మన దేశానికి పట్టిన మబ్బు. 

నేరవేరవు డబ్బు లేనివారి ఆశలు
డబ్బున్న వారివి తరగని కోరికలు
దేశంకోసం ఆలోచించలేరు పేదలు
ఉన్నవారికి ఆ ఆలోచనే రాదసలు 

మార్చుకొని దేశ యువత తమ తీరు
ఉన్నవారైనా, కాకున్నా వారికై వారు
ఆలోచించాలి దేశంకోసం ప్రతివారు
తామే చేత పగ్గాలు బూనాలి వారు 

మారిన మన రేపటి దేశ పౌరులు
కావాలి సరైన రాజకీయ వారసులు
సమగ్రతకై కావాలి వారే వారథులు
దేశ పటిష్టతకు వారే నవ్య సారథులు 

యువత చేతిలోనే మన దేశ భవిత
కావాలి కార్యశీలురు మన యువత
వారిదే గమనాన్ని మార్చే బాధ్యత
ముందుకు ‌సాగాలి భవ్య‌ దేశ చరిత

కామెంట్‌లు
Ramaseshu చెప్పారు…
చాలా చాలా బాగా చెప్పారు akka🌹🌹🌹