జీవన మార్గం..!!>కవిత; -కోరాడ నరసింహా రావు.>విశాఖపట్నం
జన్మించాక... జీవించటమంటే 
తిని,తిరిగి... 
కోరికలు తీర్చు కో వటమేనా?

జీవితమంటే... 
ఓ  బాధ్యత... ఓ నిబద్దత..!

సుఖమయ జీవనానికి... 
పటిష్టమైన ఉపాధికోసం... 
గట్టిప్రయత్నమే చెయ్యాలి !
కాలం విలువ తెలుసుకుని.... 
ఎప్పుడు... ఏది... ఎలా చెయ్యాలో...
అలా చెయ్యక పోతే...., 
అది మనిషి జీవితం లా... సాగుతుందా... ?
ఎద్దు బ్రతుకై పోదూ.... !!
చదివే వయసులో... బుద్దిగా శ్రద్ధతో చదివి...., 
ఉద్యోగం కోసం అహర్నిశలూ 
అలుపెరుగక శ్రమించీ...., 
ఆ దేవుడు ప్రేమతో ఇచ్చిన 
బహుమతి లాంటి భార్యతో, 
ప్రేమానురాగాల పంట... బిడ్డలతో సుఖించి, ఆనందిం చక....., 
ఏవేవో మితిమీరిన ఊహల్లో... 
బిడ్డలబాధ్యత విస్మరిస్తే ఎలా ?
జీవితానికైనా... 
కుటుంబాని కైనా...సమాజానికైనా...
భార్య,భర్తలే మూలంకదా...!

ఒకరు ఆర్ధికభారాన్ని... ఇంకొ కరు  
కుటుంబ సంరక్షణా భారాన్ని...
సక్రమంగా నిర్వర్తించినపుడేకదా
ఆ సంసార శకటం -
సాఫీగా... గమ్యం చేరగలిగేది !
డబ్బు... డబ్బు... డబ్బు... !
ఈ డబ్బు యాతనలో... 
భర్త  అటు....భార్య ఇటు... 
పిల్లల్ని పట్టించుకునేదెవరు ?
వాళ్ళదారి... 
మరోదారిఅయిపోదా!
పడ్డ కష్టమంతా వృధాయైపోదా?

శాంతీ - సౌఖ్యమూ లేని సంపాదన... 
బూడిదలో పోసిన పన్నీరే కదూ.... !
ఇంత చదువూ చదివి.... 
ఎంతోజ్ఞానము  కలిగీ.... 
ఇలా.. బ్రతకటం వృధాకదూ!
                  ****************

కామెంట్‌లు