తెలుగులో నూతన సాహిత్య ప్రక్రియసాహిత్యంలో అశేష ఆదరణ పొందుతున్న తేనేధారల సున్నితాలు; -యామిని కొల్లూరు--యు ఏ
 తెలుగు భాషలో వున్న  ప్రక్రియలు మరే ఇతర భాష ల్లోను కనిపించవు అంతటి సుసంపన్నం అయిన ప్రక్రియ  హితేన సహితం సాహిత్యం ఈ కళ నేటిది కాదుతెలుగు భాష పుట్టుక నుంచే వున్న అధ్భుతమైన అధ్యయనం. 
       సాహిత్యం మనిషి ఆలోచన సరళి భావావేశాల నుంచి 
పుట్టిన ఆనందం , మనిషిలో నిబిడీకృతమైన ప్రతిభాపాటవాలు  సృజనాత్మక శక్తితోకూడిన  పరిమళాలు. సమకాలీన జీవిత చిత్రమే సాహిత్యం .రచనల పరంగా చూస్తే ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు
సాహిత్యం కొత్త పుంతలతో  గోదావరిపరవళ్లుగా వారి కలాలతో అక్షర సేద్యం చేస్తు కొత్త వారితో చేయిస్తూ మార్గం 
చూపుతున్నారు. 
       తెలుగు సాహిత్యం లో ఎన్నో ప్రక్రియలు కలవు. ఒక్కో
ప్రక్రియ ఒక్కో శైలి పదజాలంతో ఎత్తుగడలతో కవి కవయిత్రుల ఆలోచన సరళి సృజనాత్మకత ఆయా ప్రక్రియ ల్లో ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కవి పాఠకుల్ని మనసుల్ని ఆకర్షిస్తు సాహిత్యం అభివ్యక్తీకరిస్తారు. సాహిత్యం లో వాడే భాష భావవ్యక్తీకరణే ఆ భాష యొక్క 
పనితీరును తెలుపుతుంది. సాహిత్యం అనేక రకాలు దేనికదే ప్రత్యేకం. 
          నేడు కవులు కవయిత్రులు మాత్రమే కాదు తెలుగు భాష మీద పట్టు మక్కువ అభిమానం ప్రేమ రాయాలనే 
సంకల్పం తపన పట్టుదల ఆచరణ ఆలోచన సరళి అకుంఠిత దీక్షతో చాలా మంది తమదైన శైలిలో అక్షరసేద్యం చేస్తున్నారు.అక్షరం  మీద పట్టు లేని వారు తాము చెప్పాలి అనుకున్న కవితలోని భావాన్ని ఏ మాత్రం ఆర్ధం చెదరకుండా
రాసే వారున్నారు, వైద్య వృత్తి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విఙ్ఞులు  కూడా కవితలని రాయటం  బహుశా మన తెలుగు భాష లోనే  సాధ్యం అవుతుంది అనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు, మన మాతృభాష అలాంటి తేనెలూరు భాష. 
      సునీత గారి నేతృత్వంలో రామప్ప వైభవం సంకలనం ,
కాళోజి కవితా సంకలనం  వెలువడ్డాయి. కాళోజి కవితా సమూహంకి నన్ను ఒక కోఆర్డినేటర్ గా నా మీద నమ్మకంతో ననన్ను నియమించారు,ఇక్కడ ఆమె పదార్థం.ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.  ఆమె వ్యక్తిత్వం కొనియాడతగింది .కూరెళ్ళ శ్రీనివాస్ గారి చిత్రకళ ఆవిష్కరణ, తపస్వి మరియు మొలక అంతర్జాల పత్రికల్లో సున్నితంబు రాసిన వారి ప్రచురణలు,సాహితి బృందావన జాతీయ వేదిక లో ప్రతి రోజు ప్రహేళిక నిర్వహించి వందప్రహేళికలు పూర్తి చేసిన వారికి చక్కని ఙ్ఞాపికను అందజేశారు కవులు కవయిత్రుల ప్రతిభను మెచ్చుకుంటూ,  మహిళా విభాగంలో యాభై నాల్గవ గ్రంధాలయ వారోత్సవాలు పోటి నిర్వహించి ప్రతిభ కనపరచిన మహిళలని అభినందించి మరోసారి ఆమె ఘనతను చాటుకున్న సునీత గారు .

        శతక సాహిత్యంలోఎందరో మహనీయులు నాలుగు పాదాలు ఆఖరు పాదం మకుటం తో రాసినవి , నేడు ప్రాచీన యుగం నుంచి నేటివరకు ఎన్నో శతకాలు పాఠకులు వల్లె వేసినవి నిత్య జీవితంలో వాటి లో నీతిని సారాంశాన్ని గ్రహించి అన్వయించుకొన్నవి కలవు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రక్రియ 'సున్నితంబు' రూపకర్త నెల్లుట్ల సునీత గారు అక్టోబర్ 2 గాంధి జయంతి రోజున ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. 
      ఈ ప్రక్రియ లో  నాలుగు పాదాలు మకుటం, సరళపదాలతో ఐదు సున్నితంబులు రాయాలి,లేదా ప్రతి పాదంలో మూడు పదాలు లేదా మాత్రచంధస్సులో  ఒకటి
నుంచి పదహారు మాత్రలతో మూడు పాదాలు అలానే రాయటం ఆఖరు పాదం మకుటం తో రాయాలి.మహిళలని ఈ సమూహం కి సమీక్షలు చేయటానికి ఎన్నుకున్నారు.  నేటి వరకు అరవై ఒక్క అంశాలతో సాగుతున్న ఈ ప్రక్రియ లో బాల కవులు కూడా తమ ప్రతభాపాటవాలతో చక్కని పదాలతో రాస్తున్నారు. వంద అంశాలకి చేరువకావటంలో ఎంతో దూరంలో లేదు.ఇలా వందసున్నితాలు పూర్తి చేసిన వారికి శతాధిక, రెండు వందలు పూర్తి చేసిన వారికి ద్విశత సుధీతిలక, ఐదు వందలు రాసినవారికి పంచశత,వెయ్యి రాసిన వారికి సహస్ర శత ఙ్ఞాపికతోవారిని అభినందించటం ప్రతి వారం ఉత్తమ విజేతలని ప్రకటిస్తు ఇలా తనదైన సాహితి సేవలో తనకంటూ ఓ ప్రత్యేకత తో కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఓ రచయిత్రి గా ఎన్నో అంశాలమీద వారి కలం నుంచి కవితలు కధలు, వ్యాసాలు, కవితాగానాలు అలా ఎన్నో ప్రక్రియలతోసాహితి సమూహలు నెలకొల్పి ,మహిళా సమూహం కూడా నెలకొల్పి, ముందుకు తీసుకువెళ్ళ్తున్న  సునీత గారు మరెంతో మంది కి మార్గదర్శకంగా వుండాలని ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సాహిత్యంలో యువత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు సునీత మేడం గారికి. 

కామెంట్‌లు
యామినీ గారు సున్నితాలపై మీ సునిశిత పరిశీలన సూపర్ 💐💐💐
GEETHARANI AVADHANULA (MAYOOKHA) చెప్పారు…
చాలా బాగా చెప్పారు యామిని గారూ..సునీత మేడం గారి సాహిత్య సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే..సున్నితాలు ప్రక్రియ గురించి అద్భుతమైన వివరణ..విశ్లేషణ అందజేసిన మీకు అభినందనలు💐💐