(క,చ,ట,త,ప) నిషిద్ధాక్షరి గజల్;- సోంపాక సీతభద్రాచలం8639311050
పంజరాన చిలకమ్మా చూడవేమె ఒకమారు
కలనైనా సరాగాలు పంచవేమె ఒకమారు..

నీఊహల జాతరతో ఒంటరినై మిగిలాను
సయ్యాటల సరిగమలుఅల్లవేమె ఒకమారు..

నీరూపే మదినిండా లతలాగా పెనవేసె
పిల్లగాలిగానైనా తాకిపోవె ఒకమారు..

నిదురమ్మని బతిమాలా నీకౌగిలి ఇవ్వమని
కలలరాణి నాచెలియను కలవాలని ఒకమారు..

పరవశాల నది

సాక్షి ఒకటడిగా కన్నులను
అరమోడ్పు క్షణాలను రాసిమ్మని ఒకమారు

దేవేరివి నీవేగా జాగేలనె ఓరమణి
నీకేలే వలపుతేరు సాగిరావె ఒకమారు..

వాదాలను,బేధాలను సమతతోటి గెలిచానె
సుమమాలతొ తరలిరావె 'సీత'లాగ ఒకమారు..

        

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా చాలా బాగుంది సీత గారూ
👌👌👌💐💐💐💐💐💐