బాలికలు బాలల గేయం; -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయుని పిఎస్ నంది వడ్డెమాన్
బాలికలను
చులకన చేస్తే 
కాళీక లవుతారు !!

బాలికలను
ప్రేమతో చూస్తే
లోకాలను పాలిస్తారు !!?

అన్నం పెట్టే అమ్మలు
బాలికలు
భాగ్యవంతులు బాలికలు !
బలవంతులు బాలికలు!!

బాలికలతో మాట్లాడితే
చుట్టాలు అవుతారు!!
బాలికలతో పోట్లాడితే
చట్టాలు అవుతారు !!?

బాలికలు చదువుకుంటే
లోక కళ్యాణం!!
బాల్యం బాలికలకు
నిత్య కళ్యాణం!!?

బాలికలు పలక బలపం
పట్టాలీ !!
ప్రపంచం బాలికలకు
గొడుగు పట్టా

లి !!?

ఆకాశంలో సగం బాలికలు !
అవకాశం లో సగ భాగం బాలికలు!!?
ఓర్పు నేర్పు బాలికల ది
ప్రతిభ పట్టుదల లో 
బాలికలదే పై చేయి !!!?

26th January. పురస్కరించుకుని
Sunithaprathap teacher ps Nandiwaddeman Nagarkurnool dist.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Very nice madam.