ఆంగ్లవత్సరానికి ఆహ్వానం అవసరమా?;-మాడుగులమురళీధరశర్మ* కాళేశ్వరం/సిద్ధిపేట*
 ఉ.మా.-1
పుట్టిన మాతృభూమికను*
పుట్టిని ముంచుతు పూర్వసంస్కృతిన్!
పట్టక; నాంగ్లవత్సరము*
పంచన జేరగ పిల్చుటేలకో?
మట్టినపుట్టిభారతిని*
మార్చెడు భారత దేశ మానవా?
పుట్టగతుల్ కనంగనిల*
పుట్టక పుట్టగ వెళ్ళుమద్దరిన్!
ఉమా-2
మెట్టుగ పూయుపుష్పములు*
మేదిని దేవుని పూజకందకన్!
జుట్టున పెట్టకుండజను*
చుండెడు వాటికి జన్మమేలకో?
వట్టిగ వాడిపోవునవి* 
వ్యర్థముగాపడిరాలిపోవ నా!
పుట్టలు పుట్టనేమినిల*
పుష్పములెన్నియయొ పుట్టిగిట్టవా?
ఉమా-3
భారత సంస్కృతీ విరుల*
భాసిలజేయుచు భాధ్యతాయుతా
భారతజాతి నిండుదన*
పర్వదినమ్మునుగాది వేళలో!
మేరునగాంతరమ్ముగను*
మేదిని హైందవ సాంప్రదాయిగా!
సారమతీంద్రుగాజరుపు*
సంక్రమణమ్ములనుత్సవమ్ముగన్!
కం.-4
ఆంగ్లపు వత్సరమిదిగా
నింగ్లాండునజరుపవలెను*
నీయుత్సవమున్!
జంగ్లీ సంస్కృతులెందుకు?
ఆంగ్లోయిండియనుగావు*
నదికనుగొనుమా!
కం-5
నీతల్లిని మరువకు మా!
కాతరభావమ్మదేల?* కఠినాత్ముడవా?
జాతీ సంస్కృతి కానిది
రాతిరిలోవేడ్కలేల?
రక్కసు లవిధిన్!
కం-6
అరుపులు గడబెడబొబ్బలు
లరయుటనీకవసరమ్మ*
నవనీతలమున్!
భరతావని దుఃఖించును
పరదేశపుబాటకేగ*
భావ్యమ చెపుమా?
కం-7
భావ కరోనా బారిన
తావున జిక్కకుము నీవు*
తనువునశించున్!
దావానలమౌదుష్కృతి
చేవనుపెంచుటనుమాని*
జీవించుమిలన్!
కం-8
ఓమైక్రానిలవచ్చెను
క్షేమమ్మగురాత్రివేళ*క్రీడించకుమా?
ఆమాంత్రమువ్యాపించును
ఏమాత్రమువీడినంత*
నీసంస్కృతులన్!
కం-9
నీజన్మమునీతల్లియు
నీజన్మసుభూమిపలుకు*
నీసంస్కృతియున్!
నీజగతినివీడకుమా?
శ్రీజాశ్రియభారతమ్ము*
స్థిరహైందవమే!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
అవసరమే.
అది అందరిదీ
ఉగాది పండుగ
మనది....!