నీకై నేను;-స్వప్న మోరల-కలం స్నేహం
చిటపట చినుకులు కురుస్తూంటే
చలచల్లని పిల్లగాలులే హాయిగా
చిలిపిగ మేనిని తాకుతూంటే ...
చామంతి పూవల్లే విరిసేను మనసు!

చల్లని చూపులు చిందించే నిన్ను
చూడాలని ఆరాటంగా...
చెమ్మగిల్లిన కన్నులతో
చోటికి వచ్చి నిరీక్షిస్తున్నాను!

చుక్కల్లో రారాజుని చూసి 
చెంతకు చేర రమ్మని పిలిచిన
చెలికాని మధుర తలపులతో...
చేర వచ్చెనని మది మురిసేను!

చిలుక పలుకుల మధుర స్వరమే
చేరాలి నేను నిన్నే అంటూ
చూపులతో చురకత్తులు తాకేలా...
చందన గుబాళింపులు మేనిని తాకేను!

చెలిమి కోరి నీవు నాతో చేరగ
చిగురించేను ఆశల హృదయం
చీకటంతా దివ్వెలు విరిసేలా...
చైతన్య దీప్తి కలిగేను నాలో!


కామెంట్‌లు
SaiKumar Panagatla చెప్పారు…
Superb madam
SaiKumar Panagatla చెప్పారు…
Excellent 👌 madam