ఆమె ప్రేమ నీకు ఎప్పటికి అర్ధంకాదు,
నీలో వెలుగుచూడాలని
ఆమె ప్రతి నిత్యం నిన్నే
తలచుకుంటూ విలపిస్తోంది
అలుసుగా అనుకోకు.
ఆమె కొవ్వొత్తి లా
కరిగిపోతూ నీకు వెలుగునివ్వాలని,
ఎంత ప్రయాసపడుతుంది నీకోసం,
మగినం నడుమ వత్తిగా, అగ్నికి ఆహుతి అవుతూ
నీకు వెలుగుని పంచుతూ,
సెగలమాటున కరుగుతూ
కుప్పకూలిన మగినపు ముద్దలా దిగజారుతుంది.
మళ్ళీ నీకోసం నీ గెలుపు చూడాలని,
కళ్ళల్లో వత్తి వేసుకుని,
మళ్ళీ మళ్ళీ నీకోసం
తాను కరిగిపోతూ వెలుగుతూ, అఖండ జ్యోతిలా అకాడమీలా
ఆమె మళ్ళీ మళ్ళీ పుడుతుంది నీకోసమే,
తనను గుర్తించలేని
నీ అజ్ఞాన అంధకారాన్ని
ప్రారద్రోలే జ్యోతి.
తన త్యాగమంతా
పగలురేయికి ప్రతీకలుగా
ఆమె నయనాలు సంధ్యప్రొద్దుల పడమట ప్రయాణం.
మరలివచ్చే తూరుపు ప్రొద్దు
నీకు వెలుగునిచ్చే జ్యోతిస్వరూపమే ఆమె..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి