*అక్షరం*;-మంజీత కుమార్--బెంగళూరు
నేను అక్షరాన్ని
భాషకు నిండుదనాన్ని

అజ్ఞానాన్ని పారద్రోలు దివ్వెని
విజ్ఞాన జ్యోతి వెలిగించు కాంతిని

అక్షరాస్యుల చేతిలో ఆభరణాన్ని
నిరక్షరాస్యుల మౌన నాదాన్ని

కవి తలపులో కవితా అల్లికని
సరిగమల మధుర సంగీతాన్ని

విప్లవవీరుల నిజమైన ఆయుధాన్ని
మదిలో మెదిలే ఆలోచనామృతాన్ని

ప్రేమికుల హృదయ వీణని
స్వప్నికుల గుండె లోతుని

సమాజాన్ని మార్చే అభ్యుదయాన్ని
అభివృద్ధికి బాటలు వేసే బీజాన్ని

మంచి చెడులు తెలిపే విచక్షనని
చరిత్ర తిరగరాసే చైతన్యాన్ని

అమ్మ నేర్పిన మొదటి పలుకుని
గురువులు దిద్దించిన తొలి పాఠాన్ని

జీవితాంతం తోడుండే బలాన్ని
దేశప్రగతికి ప్రత్యక్ష సారథినికామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది మంజీతా
అభినందనలు💐💐💐💐💐💐