:నాన్న;-:సాహితీసింధు సరళగున్నాల
చేయిపట్టినడిపి చేయూతనందించి
భక్తిభావమలర బ్రతుకునేర్పి
తప్పుదోోవ నడువ తప్పంటుదెలిపిన
ఎటుగవెళ్ళెనాన్న నెదురు రాక

ధర్మమార్గమందు ,దయతోడ చరియించి
లేనివారికిడుచు లేశమాత్ర
మైన తననుగూర్చి మాటాడనేరక
ఎటుగవెళ్ళెనాన్న నెదురులేక

బంధుగనము మెచ్చి పంచగా ప్రేమలన్
పరవశించునాన్న ప్రగతి గూర్చి
పవలురాత్రములన పలుకాడబోవక
నెచటకేగెనాన్న నెదురు లేక

మంచిమాటపలికి మంచికై నిరతమ్ము
తపనజేసినతడు తరలిపోవ
బ్రతుకు భారమయ్యె భవితచీకటియైన
నెటుగ జేరెనాన్న నెదురురాక

కామెంట్‌లు