చెరువు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఊరికి అందం చెరువండీ
చెరువుకు అందం నీరండీ 
చేపలు అందం నీటిలోన 
పువ్వులు అందం నీటిపైన 
చేలను పంటలు పండాలి 
ఇంటను పాడి నిండాలి 
నీటిని కలుషితం చేయొద్దు 
రోగాలపాలు కావద్దు 
చెరువు నీటిని కాపాడండి 
ఆరోగ్యంగా ఉండండి!!

కామెంట్‌లు