కుసుమ రాకకోసం ఎదురు చూసే గీతకు, కుసుమ రావటం చూసింది. ఏమిటే మోహం వేళాడేసుకుని వచ్చావు,కాయా పండా ఏమన్నా తింగరి వేషాలు చేసావా,అన్నది గీత. ఆ చెప్పాను. రాహుల్ మంచివాడే, కానీ, ఒట్టి పోకిరీ వెధవలాగా బిహేవ్ చేస్తాడు. ఇంకా అయ్యగారిది, కవితా, హృదయం. కవితల పిచ్చి కూడా వుంది. తొందర ఎక్కువ, అందరూ తనలాగే ఉంటారూ అనుకుంటాడు. నన్న బాగా భయపెట్టాడు, ఎలాగోలా నాతో చెప్నించాడు. అని జరిగినదంతా చెప్పింది కుసుమ.........!!
కుసుమ మాటలకు నవ్వు వచ్చింది గీతకు, ఏమిటే అలా తిడతావేంటే పోకిరీ వెధవా అని, పాపం నీతో ఎలా వేగుతాడో ఏమో అని వెటకారంగా అన్నది గీత... కానీ కుసుమ పరిస్తితి వేరు, ఒక పక్క రాహుల్ తనకు సొంతమైనాడని, పులకింతలతో, హృదయంలో ప్రేమైక అలజడులు! ఇంకో పక్క, తల్లి తండ్రుల గురించి, బెంగ..........!!
నా జీవితం ఎటు పోతుందో ఏమో!! అమ్మా నాన్నా అంటే గౌరవం. నేను రాహుల్ ను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళ పరిస్తితి ఏమిటి? వీళ్ళ పెద్దమ్మాయి ఎవరితోనో లేచిపోయిందటగా అని అవాకులూ చవాకులతో లోకులు, కాకులై, అంటూ వుంటే ఎలా భరిస్తారు? నా తరువాత నా తమ్ముడు చెల్లి వాళ్ళకు విలువ వుంటుందా? రాహుల్ పదే పదే గుర్తుకు వస్తున్నాడు.!అతనిని విడిచి వుండగలనా? అతను లేని జీవితం ఊహించలేను........!!
నేను అతనితో వెళ్ళిపోతే, అమ్మా నాన్నా కొన్నాళ్ళకు మరచిపోతారేమో, కానీ, రాహుల్ ను విడిచి, వుండలేను. అతనికి నామనసు అర్పించాను. ఇలా పరి పరి విధాలా ఆలోచిస్తూ నడుం వాల్చింది కుసుమ... బాధ లోంచి ఆనందం, ఆనందంలోంచి విషాదం! ఇదేనా జీవితం అని వాపోయింది కుసుమ..........!!
మనసు ఆనందించిన వేళ మధురమైన జ్ఞాపకాలతో నిదురించిన రేయి సూర్యుని లేత కిరణాలు భువిపై పరచగా బద్దకంగా వళ్లు విరుచుకుంటూ రాహుల్ తలపులతో నిదుర లేచిన కుసుమ అంతరంగం...ఇలలో ఓ కలలా కలల ప్రపంచపు అంచులు దాటి విహరిస్తోంది...........!!
ఆ రోజు బయటకు కదలకుండా ఇంట్లోనే వుంది. బోజనాలు పూర్తీ కాగానే అమ్మ కాసేపు పడుకుంది. తానొక్కత్తే రేడియోలో పాటలు వింటూ కూర్చుంది. ఇంతలో ఎవరన్నా వున్నారా ఇంట్లో అని వినిపించింది. గుమ్మం దాకా వెళ్ళగానే గతుక్కుమన్నది. ఎదురుగా రాహుల్. హలో మిమ్మల్నే కాసిని మంచినీళ్ళిస్తారా! అని అన్నాడు రాహుల్... ఒక్కసారి భయం తారాస్తాయికి చేరింది! నీళ్ళగ్లాసు అందించింది. ఏమిటీ ఇలా వచ్చారు, అమ్మ చూస్తే ఏమన్నా వుందా? ముందు ఇక్కడినుండి వెళ్ళండి, అని తొందర చేసింది...........!!
భయపడకు జనాభా లెక్కల కోసం వచ్చాననుకో! అన్నాడు రాహుల్. చివరికి ఈ అవతారం ఎత్తారా!!అన్నది... కుసుమ చేతిలో ఓ లెటర్ పెట్టి వెళ్ళాడు... వామ్మో ఈయన గారి వ్యవహారం శృతి మించి రాగాన పడుతున్నది! నన్ను ప్రేమిస్తున్నాడా? భయపెడుతున్నాడా? లాభం లేదు ఈసారి ఇలానే పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని గట్టిగా చెపుతా అని అనుకున్నది కుసుమ.............!!
వెళ్ళేవాడు వెళ్ళక ఒక లెటరు చేతిలో పెట్టాడు. ఎలా చదవటం, అని అనుకుంటుంటే, ఇంతలో అమ్మ లేచింది. ఎవరో వచ్చినట్టున్నారు ఎవరే అని అన్నది. జనాభా లెక్కల వాళ్ళట మంచినీళ్ళు అడిగితే ఇచ్చాను, అని అన్నది కుసుమ............
అమ్మ చూడలేదు కాబట్టి సరిపోయింది, వీడూ వీడి తింగరి వేషాలు డైరెక్ట్ గా ఇంటికే వచ్చాడు, అనుకుని, గీతా వాళ్ళింటికి, వెళ్ళొస్తా అని, అమ్మకు చెప్పి గీత దగ్గరకు వెళ్ళింది కుసుమ (సశేషం).........

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి