*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౬౯ - 69)*
 *ఇప్పటి ఈ భాగానికి ముందు భాగంలో ... నారదుడు బ్రహ్మ ను గూర్చి తపస్సు కు కూర్చోనుట - ఇంద్రుడు భయపడి తపోభంగము చేయమని మదనుడిని కాముని సహాయముతో పంపించుట - పరమేశ్వరుని ప్రభావము చేత వారిరువురూ నారదముని తపస్సు భగ్నము చేయలేక ఇంద్రుని వద్దకు వెళ్ళట తెలుసుకున్నము.... ఇక ప్రస్తుతం లో....*
*అలా నారదముని తపస్సు భగ్నము చేయలేక ఇంద్రని దగ్గకు వెళ్లిన మనమదనుడు, కాముడూ కూడా నారద ముని గొప్పగా కొనియాడారు. బారదముని తపస్సు ను భంగపరచడం ఎవరి వల్లకాదనీ, అటువంటి ప్రయత్నాలు మానుకొమ్మని ఇంద్రుని కి సూచించి, ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని వెళతారు.  ఇక నారదముని చాలా కాలం ఆ శివమహత్తు తో నిండిన ప్రదేశంలో తపస్సు చేసిన తరువాత ఆతని మనసు సంతోషపడింది. తనను లొంగదీసుకోవడానికి వచ్చిన మదనుని, కామునీ తానే తన తపశ్శక్తితో గెలిచాను అని భావించారు, నారదముని. కానీ తను వున్న ప్రదేశమంతా శువ మహత్తు తో నడినందువల్ల తాను మదనుని బారినుండి తప్పించుకున్నానని తెలుసుకో లేక పోయాడు.  నిజానికి ఈ ప్రపంచంలో ఏప్రాణికైనా శివహాత్మ్యము తెలుసుకొనుట సాధ్యము కాని పని. స్వామి మాయతో మోహితుడు కానివారు ఎవ్వరూ లేరు. నారదముని తో సహా.*
శ్లో: *దుర్ జ్ణేయ శాంభవీ మాయా సర్వేషాం ప్రాణినామిహ | భక్తం వినార్పితాత్మానం తయా సమ్మోహ్యతే జగత్||*
                                           (శి.పు. రు.సం. 2/25)
*ఈ విధంగా శివుని మాయలో వున్న నారదముని తాను మదనుని, కాముని గెలిచానని,  తనను, తన తపస్సు ను వారిరువురు  ఏమీ చేయలేక పోయారని, ఇది అంతా తన తపస్సు వల్లనే సాధ్య పడింది అని, మనస్పూర్తిగా నమ్మాడు. తపస్సు చాలించి తాను సాధించిన, తనది కాని,  ఘనమైన విషయాన్ని పరాత్పరుడు అయిన శివుని తెలియ పరచడానికి కైలాసానికి అతి శీఘ్రంగా బయలు దేరాడు.*
                                       
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు