ఉత్తమ కథలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు==9348611445

 మంచి కథలు అక్కడక్కడా పత్రికలలో వస్తే కాల గర్భంలో కలసిపోయే అవకాశాలు ఎక్కువ.అదే ఆ కథల అన్నీ పుస్తక రూపంలో వస్తే గుది గుచ్చిన పూలమాల లాగా పుస్తకంలో ఒదిగితే అంతకన్నా కావలసిందేముంది?
        బాలల కథా ప్రియులకు ఒకే పుస్తకంలో కథాహారం దొరికినట్ఠే కదా!
      'నారంశెట్టి బాల సాహిత్య పీఠం' పార్వతీపురం వారు ఉత్తమ బాల కథలను ఆహ్వానిస్తూ నిర్వహించిన పోటీలో కాచి వడపోసిన కథల్లో 26 ఉత్తమ కథలతో ఈ పుస్తకం తెచ్చారు బాల సాహితీ వేత్త శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరావు గారు.ఆయనకు బాల సాహిత్యం లో 'ఆనందలోకం' నవల వ్రాసినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.
        ఈ 26 కథల్లో నీతి లేక పిల్లలకు చెప్పదగిన పాయింట్ ఏదో ఒకటి ఉంది. ప్రతి కథ కింద  మిగిలిన స్థలంలో చెప్పుకో దగిన సూక్తులు కూడా ఇచ్చారు.
      రెండు రాష్ట్రాలలోని తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశాలనుండికూడా కొందరు తెలుగు వారు వ్రాసిన కథలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.సీనియర్ రచయితలు, ఇప్పుడు విరివిగా బాలల కథలు వ్రాస్తున్న రచయితలు, కొత్తవారి రచనలతో పుస్తకం కొత్త శోభ సంతరించు కుంది.
      శ్రీ శేష కళ్యాణి(కాలిఫోర్నియా) వ్రాసిన కథలో  స్నేహంలో చిన్న విషయాలతో అపార్థం చేసుకో కూడదని తరచి చూస్తే అసలు విషయం అర్థమవుతుందనే విషయం బాగుంది.
      'గోవిందు-గురువింద'(జొ.మార్కండేయులు వ్రాసిన కథలో వైద్యుడు తెలివిగా ఒక వ్యాపారస్థుడికి తేనె కల్తీని గురించి కళ్ళు తెరిపించడం బాగుంది.
       ఇలా ప్రతి కథలో ఏదో స్పార్క్ ఉంటుంది.
     పోతే రెండు మూడుకథలు ఇంకా బాగా వ్రాయవచ్చనిపిస్తుంది,లేక ఆ థీమ్ తో ఇంతకు ముందు చదివిన కథలు గుర్తుకు వస్తాయి. ఏది ఏమైనా ఇది ఒక మంచి పుస్తకం, పిల్లలకు,పెద్దలకు ఉపయుక్తం.
      దీని వెల రూ.70/-.దీనిని తెప్పించుకోవాలంటే శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వర రావుగారిని సంప్రదించండి.ఆయన చరవాణి సంఖ్య:9490799203లేక 7386408306.
          **********

కామెంట్‌లు
NARAMSETTI చెప్పారు…
చక్కని సమీక్ష వ్రాసిన సమీక్షకులు శ్రీ కంచెనపల్లి వెంకట కృష్ణారావు గారికి ప్రచురించిన మొలక సంపాదకులు శ్రీ వేదాంత సూరి గారికి ధన్యవాదాలు .